iDreamPost

వీడియో: కళ్లుచెదిరే ఫీల్డింగ్​తో లక్నోకు చెమటలు పట్టిస్తున్న SRH.. ఏం పట్టావ్ బ్రో!

  • Published May 08, 2024 | 8:42 PMUpdated May 08, 2024 | 8:42 PM

బ్యాటింగ్, బౌలింగ్​తో అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టడం కామనే. కానీ సన్​రైజర్స్ హైదరాబాద్ మాత్రం కళ్లుచెదిరే ఫీల్డింగ్​తో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తోంది.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు వెళ్లాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్​తో అపోజిషన్ టీమ్స్​ను భయపెట్టడం కామనే. కానీ సన్​రైజర్స్ మాత్రం కళ్లుచెదిరే ఫీల్డింగ్​తో ప్రత్యర్థి లక్నో సూపర్ జియాంట్స్​కు చెమటలు పట్టిస్తోంది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన లక్నోను ఆరెంజ్ ఆర్మీ ఫీల్డర్లు దారుణంగా దెబ్బతీశారు. ఆ టీమ్ జోరుకు ఎక్కడికక్కడ బ్రేకులు వేశారు. ఒకర్ని మించి మరొకరు అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తూ లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ (2)తో పాటు పించ్ హిట్టర్ మార్కస్ స్టొయినిస్ (3)​ను భువనేశ్వర్ కుమార్ వెనక్కి పంపాడు. అయితే ఈ ఇద్దరూ రెండు సూపర్ క్యాచ్​ల వల్ల పెవిలియన్​ చేరారు. డికాక్ ఇచ్చిన క్యాచ్​ను బౌండరీ లైన్ దగ్గర నితీష్ అద్భుతంగా అందుకున్నాడు. సూపర్ జంప్​తో బాల్​ను పట్టిన నితీష్.. బ్యాలెన్స్ తప్పడంతో బంతిని గాల్లోకి విసిరాడు. ఆ తర్వాత బౌండరీ లైన్ దాటొచ్చి మరీ క్యాచ్ పట్టాడు. అనంతరం భువీ బౌలింగ్​లో స్టొయినిస్ లెగ్ సైడ్ కొట్టిన బాల్​ను సూపర్ మ్యాన్​లా గాల్లో డైవ్ చేస్తూ అందుకున్నాడు సాన్వీర్ సింగ్. ముందు వైపు దూకుతూ నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ పట్టాడు. నితీష్, సాన్వీర్ ఫీల్డింగ్ ఎఫర్ట్ వల్ల 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో 3 వికెట్లకు 58 పరుగులే చేయగలిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి