iDreamPost

LIGER అడ్వాన్స్ బుకింగ్స్ లో లైగర్ ఫైర్

LIGER అడ్వాన్స్ బుకింగ్స్ లో లైగర్ ఫైర్

ఇంకో 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న లైగర్ బుకింగ్స్ ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా నైజామ్ లో అందులోనూ హైదరాబాద్ లో జరుగుతున్న తీరు చూస్తుంటే విజయ్ దేవరకొండ గత రెండు డిజాస్టర్ల ప్రభావం దీని మీద ఎంత మాత్రం పడినట్టు కనిపించడం లేదు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోనే నాలుగు సింగల్ స్క్రీన్లలో ఉదయం బెనిఫిట్ షోలు వేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మాములుగా టైర్ 1 స్టార్లకు ఇలా జరుగుతుంది. కానీ ఇప్పటికీ మీడియం సెగ్మెంట్ లో ఉన్న రౌడీ హీరోకి ఈ స్థాయి స్పందనంటే షాకే. కరెంట్ బుకింగ్స్ కలపనప్పటికీ రేపు దాదాపుగా అన్ని షోలకు పబ్లిక్ ఆక్యుపెన్సి భారీగా కనిపిస్తోంది.

మిగిలిన ఏరియాల్లో ఇంత భీభత్సం కాకపోయినా వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ లతో పోల్చుకుంటే చాలా మెరుగైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాని ప్రమోట్ చేసిన తీరు, ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేస్తున్న మూవీగా పూరి జగన్నాధ్ బ్రాండ్, హిందీలో ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయడం వగైరా అంశాలన్నీ ప్రీ పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొచ్చాయి. బాక్సింగ్ నేపధ్యమే అయినప్పటికీ పూరి మార్కు ఓవర్ ది బోర్డు హీరోయిజం ఇందులోనూ ఉంటుందన్న అంచనాలు మాస్ లో ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఫస్ట్ డేని చూడాలని డిసైడ్ చేసుకుంటున్నారు. హీరోయిన్ అనన్య పాండే, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కన్నా విజయ్ ఇమేజే ఎక్కువ ఫుల్ చేస్తున్న మాట వాస్తవం.

రేపీ సమయానికి లైగర్ టాక్ అండ్ రివ్యూస్ దాదాపుగా వచ్చేసి ఉంటాయి. అవి సానుకూలంగా ఉంటే ఈజీగా బ్లాక్ బస్టర్ పడిపోద్ది. కాకపోతే ఫ్యామిలీ అండ్ న్యూట్రల్ ఆడియన్స్ ని పూరి ఎలా మెప్పిస్తాడో చూడాలి. సుమారు 90 కోట్ల దాకా థియేట్రికల్ రెవిన్యూని బిజినెస్ టార్గెట్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న లైగర్ కనీసం పది రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. విజయ్ దేవరకొండ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బాలీవుడ్ ని ఊపేస్తున్న బాయ్ కాట్ లు, నిరసనలు అన్నిటికి ధీటుగా సమాధానమిస్తున్నాడు. మరి మూడేళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందో లేదో లెట్ వెయిట్ అండ్ సి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి