ఇల్లూ, భార్యా పిల్లలను వదిలి నిరంతరం దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులకు ప్రతి క్షణం మృత్యువుతో పోరాటమే. ఎప్పుడు ఏ మూల నుంచి శత్రువులు దాడికి దిగుతారో తెలియని పరిస్థితి. అయినప్పటికి నిరంతరం అప్రమత్తతతో ఉంటూ దేశ సంపదను, పౌరుల ప్రాణాలను కాపాడుతూ సేవలను అందిస్తున్నారు దేశ సైనికులు. కాగా అనంత్ నాగ్ లో ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఓ ఆర్మీ ఆఫీసర్ అమరుడయ్యారు. ఆయన అంత్యక్రియల్లో గుండెలను పిండేసే దృశ్యాలు ప్రతిఒక్కరిని కలిచివేస్తున్నాయి. అసలు […]
ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో సమాజంలో మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా కొంతమంది యువతులు.. పెళ్లి చేసుకుంటామని నమ్మించి యువకులను మోసం చేస్తున్నారు. పదుల సంఖ్యలో మగాళ్లను పెళ్లి చేసుకుని, నగలు, డబ్బుతో ఉడాయిస్తున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. తాజాగా, ఓ యువతి ఏకంగా 27 మంది యువకుల్ని మోసం చేసింది. వారిని పెళ్లి చేసుకుని, కొన్ని రోజులకే డబ్బు, నగలతో ఉడాయించింది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల […]
కొడుకు భద్రతాదళాల ఆరేషన్లో చనిపోయాడు. అది రెండేళ్ల క్రితం. ఇప్పుడు తండ్రిని తీవ్రవాదులు కాల్చిచంపారు. కాశ్మీర్ లో ఇదో విషాదం. అలాగని ఇదేమీ అసాధారణం కాదు. చాలా కుటుంబాల వ్యథ. మంగళవారం సాయంత్రం శ్రీనగర్‌లోని లాల్ బజార్ ప్రాంతంలో తవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) ముస్తాక్ అహ్మద్ లోన్ కథ ఇది. ఉగ్రవాదులు దాడి చేయడంతో మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. బుధవారం, మిలిటెంట్లు 39 సెకండ్ల ఎడిటెడ్ వీడియోను రిలీజ్ చేశారు పోలీసులను […]
తాలిబాన్లతో అమెరికా జరుపుతున్న చర్చల ప్రక్రియలో భారత్ కూడా భాగస్వామి కావాలని అగ్రరాజ్యం కోరుకుంటున్న వేళ తాలిబాన్ కీలక ప్రకటన చేసింది.తాలిబన్ రాజకీయ విభాగంగా పనిచేసే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మీడియా అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని ప్రకటించాడు.ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్ స్పష్టం చేసింది.అలాగే కాశ్మీర్లో జిహాద్ (పవిత్ర యుద్ధం) పేరిట దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి […]
భారత్‌తో సహా ప్రపంచమంతా కోవిడ్-19పై పోరు సాగిస్తుంటే దాయాది పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మాత్రం భద్రతా దళాలపై దాడులకు తెగబడుతున్నారు.ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శ్రీనగర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోఫోర్ పట్టణంలో భద్రతా దళాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు.ఈ ఉగ్రదాడులలో ముగ్గురు కేంద్ర రిజర్వు పోలీసులు ప్రాణాలు కోల్పోగా,మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముష్కరుల దాడి సమాచారంతో ఆ ప్రాంతానికి భద్రతా దళాలు హుటాహుటిన చేరుకున్నాయి.దాడికి కారకులైన తీవ్రవాదుల కోసం భద్రతా […]
జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేతను సమర్ధిస్తూ నీతిఆయోగ్ సభ్యుడు సారస్వత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. వివరాల్లోకి వెళితే వీకే సారస్వత్ గాంధీనగర్ లో ఉన్న ధీరుభాయి అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 370 అధికరణం రద్దు చేసిన అనంతరం,జమ్మూ కాశ్మీర్ లో వివాదాస్పద సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన సంగతిని ప్రస్తావిస్తూ, ఇంటర్నెట్ సేవలను […]