iDreamPost

క‌శ్మీర్ ట్రాజ‌డి, కొడుకు భ‌ద్ర‌తద‌ళాల చేతిలో చ‌నిపోయాడు. తండ్రిని తీవ్రవాదులు పొట్ట‌న‌పెట్టుకున్నారు

క‌శ్మీర్ ట్రాజ‌డి, కొడుకు భ‌ద్ర‌తద‌ళాల చేతిలో చ‌నిపోయాడు. తండ్రిని తీవ్రవాదులు పొట్ట‌న‌పెట్టుకున్నారు

కొడుకు భ‌ద్రతాదళాల ఆరేష‌న్లో చ‌నిపోయాడు. అది రెండేళ్ల క్రితం. ఇప్పుడు తండ్రిని తీవ్ర‌వాదులు కాల్చిచంపారు. కాశ్మీర్ లో ఇదో విషాదం. అలాగ‌ని ఇదేమీ అసాధార‌ణం కాదు. చాలా కుటుంబాల వ్య‌థ‌.

మంగళవారం సాయంత్రం శ్రీనగర్‌లోని లాల్ బజార్ ప్రాంతంలో త‌వ్ర‌వాదుల కాల్పుల్లో చ‌నిపోయిన‌ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) ముస్తాక్ అహ్మద్ లోన్ కథ ఇది. ఉగ్రవాదులు దాడి చేయడంతో మ‌రో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. బుధ‌వారం, మిలిటెంట్లు 39 సెకండ్ల ఎడిటెడ్ వీడియోను రిలీజ్ చేశారు

పోలీసుల‌ను మాన‌సికంగా దెబ్బ‌తీయ‌డానికి కొత్త ఎత్తుగ‌డ వేశారు. తీవ్ర‌వాదులు బాడీ కెమేరాలు వాడారు.
వాళ్లు త‌మ ఉనికిని చూపించాల‌నుకొంటున్నారు. అందుకే భ‌ద్ర‌తాద‌ళాల‌పై కాల్పుల‌ను కూడా షూట్ చేశారు.

మార్కెట్ ఓపెన్ గానే ఉంది. బాగా ట్రాఫిక్. అందరూ ఇంటికెళ్లేహ‌డావిడిలో ఉన్నప్పుడు, ఏఎస్ఐ మీద కాల్పులు జ‌రిపారు. తీవ్ర‌వాదులు. పోలీసులు ఎదురుకాల్పులు జ‌రిపేలోగా జ‌నంలో క‌లసిపోయి పారిపోయారు. మిల‌ట‌రీ వ‌చ్చిఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినా వాళ్లు దొర‌క‌లేదు.

లోన్ కుటుంబం దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉంటున్నారు. ఇక్క‌డ తీవ్ర‌వాదుల అరాచ‌కం ఎక్కువ‌. చాలా ఇళ్ల‌మీద తుపాకీ గుళ్ల గుర్తులుంటాయి. లోయ‌లో బ‌త‌కు దుర్భ‌ర‌మైన ప్రాంతాల్లో ఇదికూడా ఒక‌టి.

లోన్ కుటుంబంలో ఇది రెండో మ‌ర‌ణం. ఏప్రిల్ 2020లో, కుల్గామ్‌లోని అస్తల్ గుడ్డెర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లోన్ కుమారుడు ఆకిబ్ ముస్తాక్ చ‌నిపోయాడు. అతను చ‌దువుకొనే కుర్రాడు. ఆకిబ్ తీవ్ర‌వాది. అతను తుపాకీతో మాపై కాల్చాడు. గ్రేనెట్ విసిరాడ‌ని పోలీసులు చెప్పారు. కాని, చండీగఢ్‌లో ఇంజ‌నీరింగ్ పూర్తిచేసిన త‌ర్వాత ఇంటికొచ్చాడు. అత‌న్ని అన్యాయంగా చంపారు. ఆ త‌ర్వాత తీవ్ర‌వాద‌ని ఆరోపిస్తున్నార‌ని లోన్ కుటుంబం కేసులు పెట్టంది. ఆ కేసు విచార‌ణ‌లో ఉంది.

ఏఎస్ఐ హత్య‌లో తీవ్ర‌వాదులు కొత్త వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. ఇక‌పై ఇది కాల్పులు, ఎదురుకాల్పులు కాదు, మాన‌సిక యుద్ధం. తాము ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నారో వాళ్లను వీడియో తీసి, రిలీజ్ చేయ‌డం. అది ఎలాగూ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవుతుందికాబ‌ట్టి, మాన‌సికంగా భద్ర‌తాద‌ళాల‌పై పేచేయి సాధించ‌వ‌చ్చన్న‌ది వాళ్ల ఎత్తుగ‌డ‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి