iDreamPost

మాయ లేడి.. 27 మంది మగాళ్లను ముంచింది.. ఒకరికి తెలియకుండా మరొకర్ని..

మాయ లేడి.. 27 మంది మగాళ్లను ముంచింది.. ఒకరికి తెలియకుండా మరొకర్ని..

ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో సమాజంలో మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా కొంతమంది యువతులు.. పెళ్లి చేసుకుంటామని నమ్మించి యువకులను మోసం చేస్తున్నారు. పదుల సంఖ్యలో మగాళ్లను పెళ్లి చేసుకుని, నగలు, డబ్బుతో ఉడాయిస్తున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. తాజాగా, ఓ యువతి ఏకంగా 27 మంది యువకుల్ని మోసం చేసింది. వారిని పెళ్లి చేసుకుని, కొన్ని రోజులకే డబ్బు, నగలతో ఉడాయించింది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులు  తెలిపిన వివరాల మేరకు.. జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాకు చెందిన ఓ యువతి కొంతమంది మోసగాళ్లతో కలిసి గ్రూపుగా తయారైంది. ఈ గ్రూపులోని వాళ్లు మ్యారేజ్‌ బ్రోకర్లుగా అవతారం ఎత్తారు. వాళ్లు సదరు యువతికి బాగా డబ్బున్న వాళ్ల సంబంధాలు తెచ్చేవాడు. ఆ యువతి అందంగా ఉండటంతో వాళ్లు పెళ్లి చేసుకోవటానికి వెంటనే ఒప్పుకునే వాళ్లు. తనకు ఎవరూ లేరని ఆ యువతి వారితో చెప్పేది. దీంతో పెళ్లి కుమారుడి తరపు వారే అన్నీ తామై బంగారం కొనించేవారు. పెళ్లి కూడా ఘనంగా చేసేవారు.

పెళ్లి తర్వాత రెండు, మూడు రోజులు ఆ యువతి బానే ఉండేది. తర్వాత తన అసలు బుద్ధి చూపించేది. పెళ్లి కుమారుడి తరపు వాళ్లు పెట్టిన బంగారం, ఇంట్లోని డబ్బుతో పరారయ్యేది. ఇలా మొత్తం 27 మందిని మోసం చేసింది. వీరంతా తమ భార్య కనిపించకుండా పోయిందని భావించేవారు. వీరిలో 12 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితురాలి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.