iDreamPost

Amazon Prime Top10 Movies: అమెజాన్ ప్రైమ్ లో దూసుకుపోతున్న టాప్ 10 మూవీస్ ఇవే.. 3వ స్థానం దేనికంటే !

  • Published May 04, 2024 | 12:11 PMUpdated May 04, 2024 | 12:11 PM

ఓటీటీ లో వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి వచ్చిన సినిమాలలో ఏ ఏ సినిమాలు ట్రేండింగ్ లో ఉన్నాయో చూసేద్దాం. అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాల జాబితా వచ్చేసింది.

ఓటీటీ లో వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి వచ్చిన సినిమాలలో ఏ ఏ సినిమాలు ట్రేండింగ్ లో ఉన్నాయో చూసేద్దాం. అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాల జాబితా వచ్చేసింది.

  • Published May 04, 2024 | 12:11 PMUpdated May 04, 2024 | 12:11 PM
Amazon Prime Top10 Movies: అమెజాన్ ప్రైమ్ లో దూసుకుపోతున్న టాప్ 10 మూవీస్ ఇవే.. 3వ స్థానం దేనికంటే !

ఏదైనా ఓ సినిమా చూద్దాం అని ఆలోచన వచ్చినా చాలు.. కళ్ళ ముందు తనివితీరానన్ని సినిమాలు వచ్చేశాయి. రోజంతా కూర్చుని చూసిన అసలు బోర్ కొట్టించని సినిమాలు, సిరీస్ లు మన ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఎన్నో సినిమాలను, సిరీస్ లను ఆడియన్స్ ముందుకు తీసుకుని వచ్చేస్తుంది. తమ సబ్ స్క్రైబర్స్ ను పెంచుకునే దిశగా ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలను, సిరీస్ లను రిలీజ్ చేయడానికి సిద్ధంగా అవుతుంది అమెజాన్ ప్రైమ్. మరి ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 లో ట్రెండింగ్ లో నిలిచినా సినిమాల జాబితా వచ్చేసింది. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

1. ఫ్యామిలీ స్టార్:
విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్యన థియేటర్ లో రిలీజ్ అయింది కానీ.. ఊహించిన రేంజ్ లో థియేటర్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఎవరు ఊహించని విధంగా.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో రిలీజ్ అయినా ఈ సినిమాకి విశేష ఆదరణ లభిస్తుంది. దీనితో ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో టాప్ 1 లో ట్రెండ్ అవుతుంది.

2. రీ బాటన్ మే ఐసా ఉల్జా జియా:
కృతి సనన్, షాహిద్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా.. థియేటర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా.. బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయిన తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ.. అమెజాన్ ప్రైమ్ లో టాప్ 2 స్థానం దక్కించుకుంది.

3. ఆపరేషన్ వాలెంటైన్ :
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం.. కథ పరంగా బావున్నా కూడా థియేటర్ లో ప్రేక్షకులను ఎందుకో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా కూడా ఊహించని విధంగా.. ఓటీటీ లవర్స్ ను మాత్రం మెప్పించేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో టాప్ 3 స్థానాన్ని దక్కించుకుంది.

4. ది ఐడియా ఆఫ్ యు :
ఇది ఒక ఇంగ్లిష్ సినిమా.. ,ఈ సినిమాకు మైకేల్ షోల్డర్ దర్శకత్వం వహించారు, థియేటర్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీ లోను మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో టాప్ 4 ట్రెండింగ్ అవుతోంది.

5. కాగజ్ 2:
అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్, నీనా గుప్తా ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమా… తన కూతురి కోసం తండ్రి చేసే న్యాయపోరాటం చుట్టూ తిరుగుతుంది, ప్రస్తుతం ఈ సినిమా టాప్ 5 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

6. ఓం భీమ్ బుష్:
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, థియేటర్ లో అందరిని నవ్వించి.. అంత క్రేజ్ టాక్ ను ఓటీటీ లో కూడా సంపాదించుకుంది ఈ సినిమా..ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఆరవ స్థానంలో దూసుకుపోతుంది.

7. అవతార పురుష 2:
ఇది ఒక కన్నడ సినిమా.. ఈ సినిమా కూడా థియేటర్ లో మంచి టాక్ ను సంపాదించుకుని.. ఓటీటీ లో కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమా టాప్ 7 ట్రేండింగ్ లో దూసుకుపోతుంది.

8. యువ:
ఈ సినిమా కూడా కన్నడ భాషకు చెందినదే.. ఎంతో మంది యూత్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని చెప్పి తీరాలి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకుంది.

9. చార్లీ 777:
ఈ సినిమాను ఇప్పటికే అందరు చూసి ఉంటారు.. కన్నడలో వచ్చిన ఓ ఫీల్ గుడ్ మూవీ ఇది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో టాప్ 9 లో ట్రేండింగ్ అవుతుంది.

10. జే బేబీ:
తల్లిని వెతుక్కుంటూ వెళ్లే ఇద్దరు కొడుకుల కథ ఇది..చివరి వరకు చక్కని ఎమోషన్ ను క్యారీ చేస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా టాప్ 10 లో ఉంది.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి