iDreamPost

క్రికెట్​లోనే కాదు రియల్ లైఫ్​లోనూ దేవుడే.. సచిన్ నీకు మా సెల్యూట్!

  • Published Mar 01, 2024 | 5:42 PMUpdated Mar 01, 2024 | 5:42 PM

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన మంచి మనసును ఎన్నోసార్లు చాటుకున్నాడు. సాయం కోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకోవడంలో మాస్టర్ బ్లాస్టర్ ముందుంటాడు.

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన మంచి మనసును ఎన్నోసార్లు చాటుకున్నాడు. సాయం కోరి వచ్చిన వారిని అక్కున చేర్చుకోవడంలో మాస్టర్ బ్లాస్టర్ ముందుంటాడు.

  • Published Mar 01, 2024 | 5:42 PMUpdated Mar 01, 2024 | 5:42 PM
క్రికెట్​లోనే కాదు రియల్ లైఫ్​లోనూ దేవుడే.. సచిన్ నీకు మా సెల్యూట్!

క్రికెటర్లు అంటే లగ్జరీ లైఫ్, ఏది కావాలన్నా క్షణాల్లో కళ్ల ముందుకు వచ్చేస్తుందని అనుకుంటారు. అవును, మన దేశంలో క్రికెటర్లకు ఉండే ఫేమ్, క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. వాళ్లు ఏది కోరుకున్నా క్షణాల్లో వచ్చేస్తుంది. మ్యాచుల్లో ఆడటం ద్వారానే కాదు.. యాడ్స్, వ్యాపారాలు ఇతరత్రా రూపంలో రూ.కోట్లకు రూ.కోట్లు డబ్బును వెనకేసుకుంటారు. అయితే కొందరు ప్లేయర్లు చేసే మంచి పనుల గురించి మాత్రం అంతగా బయటకు రాదు. సామాన్య నేపథ్యం నుంచి ఈ స్థాయికి చేరుకున్న పలువురు ఆటగాళ్లు తమ మూలాల్ని మర్చిపోరు. తమ కష్టం ఇంకొకరికి రాకూడదని అడిగిందే తడవుగా అందరికీ సాయం చేస్తారు. యంగ్​ క్రికెటర్స్​కు, పిల్లలు, వృద్ధులకు హెల్ప్ చేయడంలో భారత క్రికెటర్లు ముందుంటారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ విషయంలో మిగతా వారి కంటే ముందంజలో ఉన్నాడు. దానికి తాజా ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.

ఇంటర్నేషనల్ క్రికెట్​కు ఎప్పుడో దూరమైన సచిన్.. సేవా కార్యక్రమాలను మాత్రం వదల్లేదు. తనకు ఉన్నంతలో పది మందికి సాయం చేసేందుకు అతడు తపన పడుతుంటాడు. పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాడు. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 60 వేల మంది చిన్నారులు పెదవి సంబంధిత వైకల్యంతో జన్మిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి తన ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ చేయించి వారి పెదాలపై చిరునవ్వు తెప్పిస్తున్నాడు మాస్టర్ బ్లాస్టర్. సర్జరీకి ముందు, ఆ తర్వాత వారు ఎలా మారిపోయారో చూపే వీడియోలను సచిన్ ట్విట్టర్​లో అందరితో పంచుకున్నాడు. కశ్మీర్ విజిట్​లో భాగంగా శ్రీనగర్​లోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించామని వెల్లడించాడు.

సచిన్ చేస్తున్న సేవలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సేవల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని అంటున్నారు. సచిన్.. నీకు మా సెల్యూట్ అంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలను ఆయన ఇలాగే కొనసాగించాలని చెబుతున్నారు. అంత మంది చిన్నారుల చిరునవ్వుకు కారణమైన మాస్టర్​ బ్లాస్టర్ దేవుడితో సమానమని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాట్​తో పరుగుల వర్షం కురిపించి క్రికెట్​ దేవుడిగా ప్రశంసలు అందుకున్న సచిన్.. ఇలాంటి గొప్ప కార్యక్రమాల ద్వారా రియల్ లైఫ్​లోనూ దేవుడిగా మన్ననలు పొందడం అభినందనీయం అనే చెప్పాలి. కాగా, సచిన్ కశ్మీర్ పర్యటనపై ప్రధాని మోడీ స్పందించారు. దేశంలో ఎన్నో విభిన్నమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని.. సచిన్ కశ్మీర్​ను పర్యటించడం మంచి విషయమని మెచ్చుకున్నారు. కశ్మీర్ విల్లో బ్యాట్లు, ఉజ్వల భారత్ గురించి సచిన్ చాటిచెప్పడం అద్భుతమంటూ ప్రశంసించారు. మరి.. సచిన్ సేవలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాక్‌పై సచిన్ శివతాండవానికి 21 ఏళ్లు! క్రికెట్ దేవుడు మూడో కన్ను తెరిచిన రోజు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి