iDreamPost

టీ20 ప్రపంచ కప్ జట్టు ప్రకటించిన అమెరికా.. టీమ్ నిండా మనోళ్లే! 

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే పేరుకే అమెరికా టీమ్ అయినప్పటికీ.. జట్టు నిండా మనోళ్లే ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే పేరుకే అమెరికా టీమ్ అయినప్పటికీ.. జట్టు నిండా మనోళ్లే ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ జట్టు ప్రకటించిన అమెరికా.. టీమ్ నిండా మనోళ్లే! 

టీ20 వరల్డ్ కప్ 2024లో మెుత్తం 20 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. ఇక ఈ మహా సంగ్రామం కోసం అన్ని జట్లు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ కప్ లో పాల్గొనే టీమ్స్ ను దాదాపు అన్ని దేశాలు ప్రకటించాయి. తాజాగా అమెరికా కూడా ఈ పొట్టి కప్ లో పాల్గొనబోయే సభ్యుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అని మీకు అనుమానం రావొచ్చు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పేరుకే అది అమెరికా జట్టు.. కానీ అందులు ఉన్న వారిలో ఎక్కువ మంది మన భారతీయ మూలాలు ఉన్న ఆటగాళ్లు కావడం విశేషం. మరి టీమ్ లో ఎంత మంది ఇండియన్ మూలాలు ఉన్న వారు ఉన్నారు? వారు ఎవరు? తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే అమెరికా ప్రకటించిన 15 మందిలో ఏడుగురు మనోళ్లే.. అదేనండి భారతీయ మూలాలు ఉన్న ఆటగాళ్లే. గుజరాత్ అండర్ 19 టీమ్ కు ఆడిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన మోనాంక్ పటేల్ ప్రస్తుతం ఈ వరల్డ్ కప్ లో అమెరికా టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడితో పాటుగా 2018-19 రంజీ సీజన్ లో అత్యధిక పరుగులు(1331) చేసిన మిలింద్ కుమార్ కు సైతం టీమ్ లో చోటు దక్కింది. అతడు త్రిపుర, ఢిల్లీ, సిక్కిం తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. అంతే కాకుండా మిలింద్ ఐపీఎల్ లో ఢిల్లీ, ఆర్సీబీ జట్లకు కూడా ప్రాతినిథ్యం వహించాడు.

ఇక వీరితో పాటు ముంబై బౌలర్లు హర్మిత్ సింగ్, సౌరభ్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్ లు ఉన్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే? టీమిండియాకు అండర్ 19 వరల్డ్ కప్ అందించిన ఉన్ముక్ చంద్ మాత్రం జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ కోరే అండర్సన్ సైతం అమెరికా తరఫున బరిలోకి దిగబోతుండటం విశేషం. వీరితో పాటుగా పాకిస్తాన్ సంతతికి చెందిన  అలీ ఖాన్ కూడా టీమ్ లో ప్లేస్ దక్కించుకున్నాడు.

అమెరికా టీమ్:

మోనాంక్ పటేల్(కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, హర్మిత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, నితీశ్ కుమార్, నిసర్గ్ పటేల్, కోరే అండర్సన్, అలీ ఖాన్, మిలింద్ కుమార్, జెస్సీ సింగ్, కెంజిగే, షాడ్లీ, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి