తెలుగుదేశం మండలి రభస నెలరోజులు సంబరానికేనా? సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులు రెండవ సారి శాసన మండలిలో అడ్డుకోగలిగాం అని తెలుగుదేశం చెబుతుంది. కానీ రాజ్యంగ ప్రకారం వారు ఆ బిల్లుని కేవలం నెలరోజులు మాత్రమే అడ్డుకోగలిగినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంత్రాలు సమాంతరంగా అభివృద్ది చెందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుని తెలుగుదేశం మొదటినుండి వ్యతిరేకిస్తూ వస్తుంది. రాజధాని అమరావతిలోనే ఉంచాలని పట్టుపడుతోంది. ఈ క్రమంలో గత […]
ఏపీ శాసనమండలిలో మళ్లీ మంటలు చెలరేగాయి. ఆరు నెలల తర్వాత కూడా మంటలు చల్లారిన దాఖలాలు కనిపించలేదు. సరికదా ఇప్పడు సమస్య మరింత ముదిరే పరిస్థితి వచ్చింది. టీడీపీ తీరు మారకపోవడం బట్టబయలు అయ్యింది. ఇప్పుడు అసెంబ్లీలో అంతా ప్రశాంతంగా సాగిందని అంతా భావిస్తున్న సభలో మరోసారి పెద్దల సభ చిన్నబోవడం విస్మయకరంగా మారింది. జనవరిలో జరిగిన పరిణామాలు కొనసాగడమే కాకుండా ఈసారి ఏకంగా బడ్జెట్ కి సైతం మోక్షం కలగని స్థితి ఏర్పడడంతో రాష్ట్రంలో ప్రత్యేక […]
చైర్మన్ గారు మీ సెలెక్ట్ కమిటి నిర్ణయాన్ని నేను అమలు పర్చలేను అని మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు రెండుసార్లు దస్త్రాన్ని చైర్మన్ కు తిప్పి పంపటంతో రాజ్యాంగ సంక్షోభం అంటూ పత్రికలూ వార్తలు రాసిన నేపథ్యంలో శాసనమండలి కార్యదర్శి సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని ఎందుకు వెనక్కి పంపాడు? మండలి చైర్మన్ కు రాసిన నోట్ లో కార్యదర్శి “సభను నడపడంలో ఛైర్మన్‌కు సలహాలు ఇవ్వటం,గైడ్ చెయ్యటం,సహాయపడటం నా బాధ్యత. నిబంధనల అమలులో లోపాలు,పొరపాట్లు ఉంటె వాటిని చైర్మన్ కు తెలియచెప్పటం […]
ఏపీలో పాలన వికేంద్రీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం చెప్పినట్టుగానే వ్యవహారం చక్కబెడుతోంది. ఏపీ హైకోర్టులో మాట ఇచ్చినట్టుగా శాసనపరమైన వ్యవహారం పూర్తి చేస్తోంది. ఇప్పటికే మండలిలో సాంకేతికంగా ఆమోదం పొందినట్టుగానే భావిస్తున్న బిల్లుకి అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తెలపడం ద్వారా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. టీడీపీ తొలుత ఈ సమావేశాలను బహిష్కరించాలని భావించినప్పటికీ రాజధాని బిల్లుల విషయంలోనే మళ్లీ వెనక్కి తగ్గింది. బడ్జెట్ సమావేశాలను పూర్తిగా బాయ్ కాట్ చేస్తే సీఆర్డీయే రద్దు, పాలన […]
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్రమంగా అమలు చేసేందుకు పూనుకుంటున్నారు. పాలనా సంస్కరణలతో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్, తాజాగా రాజధానుల విషయంలో కూడా స్పష్టతకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వం ముందడుగు వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖలో సెక్రటేరియేట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాటికి అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు సడలింపుల తర్వాత మళ్లీ […]
అఖండ విజయంతో జన హృదయాలు గెలుచుకున్న జగన్ కి ఏడాది పాలనలో ఎదురులేకుండా పోయింది. అనేక కీలక నిర్ణయాలతో పాలనా వ్యవస్థనే సమూలంగా మార్చేసే రీతిలో ఆయన వ్యవహరించారు. అటు అసెంబ్లీలోనూ ఇటు ప్రజల్లోనూ బలం లేని ప్రతిపక్షం నుంచి పెద్దగా అడ్డంకులు లేకుండా పోయింది. అయితే అన్ని సందర్భాల్లోనూ జగన్ ఎజెండాకి అడుగడుగునా అడ్డంకులు న్యాయవ్యవస్థ నుంచే ఎదురయ్యాయి. ఇప్పటికే అది సుస్పష్టంగా కనిపిస్తోంది. జగన్ ఏడాది పాలనలో సుమారు ఆరు నెలలుగా నేరుగా న్యాయవ్యవస్థ […]
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పధకంలో భాగంగా అమరావతి లో జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమానికి ఏపీ హై కోర్ట్ బ్రేక్ వేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల్ని ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన 51 వేల మందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం 1215 ఎకరాల భూమిని కేటాయించింది. దీనిపై ప్రభుత్వం జీవో జారీ […]
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆంధ్రప్రదేశ్ పరిపాలన విశాఖ నుంచి సాగనుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చకచకా చేస్తోంది. ఇప్పటికే భవనాల అన్వేషణ ప్రారంభమైంది. తాజాగా సచివాలయ ఉద్యోగులు మే నెలాఖరు నాటికి విశాఖకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగుల సంఘం తెలిపింది. నిన్న బుధవారం సచివాలయంలో జరిగిన ఆ సంఘం ఎగ్జిక్యూటిక్ కమిటీ సమావేశం పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఇవీ ఉద్యోగుల డిమాండ్లు.. – ఉగాదిలోపు రెండు డీఏలు ఇవ్వాలి. – బయోమెట్రిక్ విధానంలో […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వ్యవహారం ఖండాంతరాలకు చేరింది. రాజధాని విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఏపీ రాజధానిగా అమరాతినే కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో యూఎస్‌కు చెందిన ఎన్నారై కావేటి శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి కోసం జరగుతున్న ఉద్యమంలో సీరియస్‌నెస్ లేదని తాజా ఘటన నిరూపిస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానాలను ఏవైనా రెండు దేశాలు మాత్రమే వారి మధ్య […]
ఏపీ రాజధాని అంశంలో బీజేపీ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. ఆపార్టీ నేతలు ఇప్పుటికే తలోదారిన వ్యవహరిస్తన్నారు. కేంద్రంలోని పెద్దల వ్యవహారానికి ఏపీలోని బీజేపీ నేతల తీరుకి పొంతన ఉన్నట్టు కనిపించలేదు. దాంతో రెండు నాలుకల వ్యవహారం సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగానే ఆపార్టీ వ్యవహారం ఉండడంతో ఆశించిన ఫలితాలు రాకపోగా బీజేపీ మీద ప్రజల్లో అపోహలు పెరిగాయి. చివరకు అమరావతిలో ఉద్యమిస్తున్న వారు కూడా కమలం నేతలను విశ్వసించే పరిస్థితి కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో మరోసారి కన్నా […]