iDreamPost

ముహూర్తం మే.. విశాఖకు వెళ్లాలంటే ఇవి కావాలి..

ముహూర్తం మే.. విశాఖకు వెళ్లాలంటే ఇవి కావాలి..

విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన విశాఖ నుంచి సాగనుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చకచకా చేస్తోంది. ఇప్పటికే భవనాల అన్వేషణ ప్రారంభమైంది. తాజాగా సచివాలయ ఉద్యోగులు మే నెలాఖరు నాటికి విశాఖకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగుల సంఘం తెలిపింది. నిన్న బుధవారం సచివాలయంలో జరిగిన ఆ సంఘం ఎగ్జిక్యూటిక్‌ కమిటీ సమావేశం పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

ఇవీ ఉద్యోగుల డిమాండ్లు..

– ఉగాదిలోపు రెండు డీఏలు ఇవ్వాలి.

 బయోమెట్రిక్ విధానంలో తిరిగి హాజరు రిజిస్టర్ ను అమలు చేయాలి.

– ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.

– 2015–19 మధ్యలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం రుణాలు తీసుకున్న ఉద్యోగులకు వడ్డీ మాఫీ చేయాలి.

– పిల్లల చదువుకు విశాఖలో ఏర్పాట్లు చేయాలి.

– దంపతులిద్దరూ ఉద్యోగులైతే వారిద్దరూ విశాఖలో ఉండేలా బదిలీలు చేయాలి.

– షిఫ్టింగ్‌ అలవెన్స్‌ ఇవ్వాలి.

– బ్యాచెలర్స్‌కు వసతి సదుపాయం కల్పించాలి.

– అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలం తీసుకోని ఉద్యోగులకు ప్రత్యేక రుణాలు ఇవ్వాలి.

– హెచ్‌ఆర్‌ఏ 30 శాతం ఇవ్వాలి.

– రావాణా సౌకర్యం కల్పించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి