iDreamPost
android-app
ios-app

వీడియో: స్టార్ హీరోయిన్​తో రస్సెల్ మాస్ స్టెప్స్.. బ్యాటింగే కాదు డ్యాన్స్​లోనూ తోపే!

  • Published May 08, 2024 | 7:42 PM Updated Updated May 08, 2024 | 7:42 PM

కరీబియన్ వీరుడు ఆండ్రీ రస్సెల్ అంటే అందరూ విధ్వంసక బ్యాటర్, మంచి బౌలర్ అనే అనుకుంటారు. కానీ అతడిలో డ్యాన్స్ టాలెంట్ కూడా ఉంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్​తో కలసి మాస్ స్టెప్స్ వేశాడు రస్సెల్.

కరీబియన్ వీరుడు ఆండ్రీ రస్సెల్ అంటే అందరూ విధ్వంసక బ్యాటర్, మంచి బౌలర్ అనే అనుకుంటారు. కానీ అతడిలో డ్యాన్స్ టాలెంట్ కూడా ఉంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్​తో కలసి మాస్ స్టెప్స్ వేశాడు రస్సెల్.

  • Published May 08, 2024 | 7:42 PMUpdated May 08, 2024 | 7:42 PM
వీడియో: స్టార్ హీరోయిన్​తో రస్సెల్ మాస్ స్టెప్స్.. బ్యాటింగే కాదు డ్యాన్స్​లోనూ తోపే!

కరీబియన్ వీరుడు ఆండ్రీ రస్సెల్ అంటే అందరూ విధ్వంసక బ్యాటర్, మంచి బౌలర్ అనే అనుకుంటారు. అందుకు తగ్గట్లే బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ షాట్లతో విరుచుకుపడతాడు రస్సెల్. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి అతడు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. తుఫాన్ ఇన్నింగ్స్​లతో అపోజిషన్ బౌలర్లను బెంబేలెత్తించడం, మ్యాచ్​ను వన్ సైడ్ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. పేస్ బౌలర్ కూడా అయిన ఈ విండీస్ ధీరుడు బ్రేక్ త్రూ కావాలన్న ప్రతిసారి వికెట్లు తీస్తూ టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంటాడు. అయితే బ్యాటింగ్, బౌలింగ్​తో పాటు రస్సెల్​లో డ్యాన్స్ టాలెంట్ కూడా ఉంది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్​తో కలసి మాస్ స్టెప్స్ వేశాడు రస్సెల్.

వెస్టిండీస్ క్రికెటర్లు గ్రౌండ్​లో హుషారుగా ఉంటారనేది తెలిసిందే. వికెట్లు తీసినా, సిక్సులు కొట్టినా, సెంచరీలు చేసినా వింతగా సెలబ్రేట్ చేసుకుంటారు. డ్యాన్స్ చేస్తూ ఆడియెన్స్​ను కూడా ఉత్సాహపరుస్తుంటారు. క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే తాను కూడా అలాంటి వాడ్నేనని మరో కరీబియన్ వీరుడు ఆండ్రీ రస్సెల్ అంటున్నాడు. అనడమే కాదు.. అదిరిపోయే స్టెప్స్​తో అలరించాడు. ప్రముఖ హీరోయిన్ అవికా గోర్​తో కలసి అతడు ఆడిపాడిన ఓ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయింది. ‘లడ్కీ తు కమాల్ కీ’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్​ను ఊపేస్తోంది. ఇందులో హుషారైన స్టెప్పులతో అదరగొట్టాడు రస్సెల్.

ఈ సాంగ్​లో అవికా గోర్ బ్లూ శారీలో మెరిశారు. హుక్ స్టెప్స్​తో ఆమె ఆకట్టుకున్నారు. అయితే రస్సెల్ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచాడు. ఆరెంజ్ కలర్ లుంగీలో బ్లాక్ కలర్ బనియన్, స్టైలిష్​ షర్ట్​తో అందరి ఫోకస్ తన మీద నిలిచేలా చూసుకున్నాడు. కళ్లకు కూలింగ్ గ్లాసెస్, చేతిలో వాచ్ పెట్టుకొని చాలా స్టైలిష్​గా కనిపించాడు. అవికా గోర్​తో పోటీపడుతూ డ్యాన్స్ చేశాడు. నవ్వుతూ, కూల్​గా అతడు వేసిన స్టెప్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఈ ఐపీఎల్​లో ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో 198 పరుగులు చేసిన రస్సెల్.. బౌలింగ్​లోనూ రాణించి 13 వికెట్లు తీశాడు. మరి.. రస్సెల్-అవికా గోర్ డ్యాన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş