iDreamPost

వరల్డ్ కప్ కోసం సంజూతో రోహిత్ మాస్టర్ ప్లాన్! అంత పెద్ద బాధ్యతను మోస్తాడా?

  • Published May 08, 2024 | 7:30 PMUpdated May 08, 2024 | 7:30 PM

వన్డే వరల్డ్ కప్ మిస్సైన బాధలో ఉన్న భారత జట్టు.. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్​ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మెగా టోర్నీలో టీమ్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. సంజూ శాంసన్​కు పెద్ద బాధ్యత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వన్డే వరల్డ్ కప్ మిస్సైన బాధలో ఉన్న భారత జట్టు.. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్​ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మెగా టోర్నీలో టీమ్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. సంజూ శాంసన్​కు పెద్ద బాధ్యత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

  • Published May 08, 2024 | 7:30 PMUpdated May 08, 2024 | 7:30 PM
వరల్డ్ కప్ కోసం సంజూతో రోహిత్ మాస్టర్ ప్లాన్! అంత పెద్ద బాధ్యతను మోస్తాడా?

వన్డే వరల్డ్ కప్ మిస్సైన బాధలో ఉన్న భారత జట్టు.. టీ20 వరల్డ్ కప్​ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. త్వరలో జరిగే ఈ మెగా టోర్నీలో టీమ్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్​కు పెద్ద బాధ్యత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీ నెరవేరుస్తూ వచ్చిన రెస్పాన్సిబిలిటీని సంజూకు బదిలీ చేయడానికి రంగం సిద్ధమైందట. రోహిత్​ ఆలోచనకు కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమ్ మేనేజ్​మెంట్ కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇది గానీ వర్కౌట్ అయితే భారత్​ను వరల్డ్ కప్ కొట్టకుండా ఎవరూ ఆపలేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు హిట్​మ్యాన్ వేసిన ప్లాన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వెస్టిండీస్-యూఎస్ఏ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్​లో విరాట్ కోహ్లీ ఓపెనర్​గా రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై పలు ఇండికేషన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు ఇన్నాళ్లూ ఆడుతూ వచ్చిన ఫస్ట్ డౌన్​లో ఎవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఇక్కడే రోహిత్ తన బుర్రను వాడినట్లు తెలుస్తోంది. విరాట్ స్థానంలో సంజూను ఆడించాలని హిట్​మ్యాన్ భావిస్తున్నాడట. సంజూ పేసర్లను బాగా ఎదుర్కొంటాడు. స్పిన్నర్లను ఆడటంలోనూ అతడు ఆరితేరాడు. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో కలిపి స్పిన్నర్ల బౌలింగ్​లో 107 బంతుల్లో 145 స్ట్రైక్ రేట్​తో 156 పరుగులు చేశాడు సంజూ. ఇందులో 11 బౌండరీలతో పాటు 6 సిక్సులు ఉన్నాయి.

ఈసారి ఐపీఎల్​లో ఒక్కసారి కూడా స్పిన్నర్ల బౌలింగ్​లో సంజూ ఔట్ అవ్వలేదు. వరల్డ్ కప్​లో ఫస్ట్ డౌన్​లో అతడ్ని ఆడించాలని రోహిత్ డిసైడ్ అవడం వెనుక ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ప్రపంచ కప్​కు ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్​లో పిచ్​లు చాలా స్లోగా ఉంటాయి. అక్కడ పరుగులు చేయాలంటే పేస్, స్పిన్​ను సమర్థంగా ఎదుర్కొనే బ్యాటర్లు కావాలి. మిడిల్ ఓవర్లలో ఒకవైపు వికెట్లను కాపాడుతూనే మరోవైపు వేగంగా పరుగులు చేసే కెపాసిటీ ఉన్నవాళ్లు అవసరం. ఇవి రెండూ సంజూలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కోహ్లీలా అతడ్ని ఫస్ట్ డౌన్​లో దింపి యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడించాలనేది రోహిత్ వ్యూహమని వినికిడి. మిడిల్ ఓవర్స్​లో అతడు సక్సెస్ అయితే తర్వాత వచ్చే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబె మిగిలిన పనిని ఫినిష్​ చేస్తారని అనుకుంటున్నాడట. ఇది తెలిసిన నెటిజన్స్.. రోహిత్ రిస్క్​లో లాజిక్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది గానీ వర్కౌట్ అయిందా భారత్​కు తిరుగుండదని, కప్పు కొట్టకుండా ఎవరూ ఆపరేరని చెబుతున్నారు. మరి.. వరల్డ్ కప్​లో సంజూ ఫస్ట్ డౌన్​లో దిగితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి