Nidhan
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఘోర అవమానం. ఇదంతా రోహిత్ శర్మకు తెలిసే జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఘోర అవమానం. ఇదంతా రోహిత్ శర్మకు తెలిసే జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Nidhan
ఈ మధ్య కాలంలో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వారిలో జస్ప్రీత్ బుమ్రా ఒకడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తూ భారత జట్టుకు వెన్నెముకగా మారాడు పేసుగుర్రం. వైట్ బాల్, రెడ్ బాల్ అనే తేడాల్లేవు.. బరిలోకి దిగాడా బ్యాటర్లను పడగొట్టాల్సిందే అనేది అతడి టార్గెట్. వన్డేలు, టెస్టులతో పాటు టీ20ల్లోనూ అతడి రోల్ చాలా కీలకంగా మారింది. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో 20 వికెట్లు తీశాడు బుమ్రా. వరల్డ్ క్లాస్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. అంత బాగా ఆడినా కప్పు మిస్సవడంతో అతడు బాధలో ఉన్నాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. అయితే ఈ తరుణంలో అతడికి ఘోర అవమానం జరిగిందని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్‌లో ఆడే భారత జట్టును మరికొన్ని గంటల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో జట్టులో ఏయే ఆటగాళ్లు ఉంటారు? ఎవరెవరికి చోటు లభిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అదే టైమ్‌లో టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఎవరు ఉంటారు? అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. బాల్ బాల్‌కు ఆధిపత్యం మారే టీ20ల్లో కెప్టెన్‌కు అండగా ఉంటూ డిసిషన్స్ తీసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తాడు వైస్ కెప్టెన్. అలాంటి పోస్ట్‌కు అనుభవం ఉన్న జస్ప్రీత్ బుమ్రా లాంటోడు పర్ఫెక్ట్ అని అంతా అంటున్నారు. టీమ్‌లో రెగ్యులర్ ప్లేయర్ అయిన బుమ్రాకు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి పట్టు ఉంది. అయితే ఈ విషయంలో అతడికి బీసీసీఐ అన్యాయం చేసిందని తెలుస్తోంది.
మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్, ఎంతో అనుభవం ఉన్న బుమ్రాను కాదని హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ల్లో ఒకర్ని వైస్ కెప్టెన్ చేయాలనే ఆలోచనల్లో సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు ఉన్నారట. అయితే ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. బుమ్రా కంటే మించినోడు, అనుభవజ్ఞుడు, వైస్ కెప్టెన్ రోల్‌కు సరైనోడు టీమ్‌లో లేడని అంటున్నారు. హార్దిక్ కంప్లీట్‌గా రికవర్ కాలేదు, ఐపీఎల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.. అలాంటోడికి జట్టులో చోటు ఇవ్వడమే గొప్ప, అలాంటిది వైస్ కెప్టెన్సీ ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న పంత్ బాగా ఆడుతున్నాడు, కానీ రెండేళ్ల తర్వాత వస్తున్న ప్లేయర్‌ను డైరెక్ట్‌గా వైస్ కెప్టెన్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఇంతకాలంగా టీమ్‌తో ఉన్న బుమ్రాను ఇది అవమానించినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. టీమ్‌కు అతడు అందిస్తున్న సేవలకు వైస్ కెప్టెన్సీ ఇచ్చి గౌరవించాల్సిందేనని అంటున్నారు. బుమ్రాను కాదని హార్దిక్, పంత్ల్లో ఒకర్ని వైస్ కెప్టెన్ చేస్తామంటే రోహిత్ శర్మ ఎలా ఒప్పుకున్నాడంటూ నిలదీస్తున్నారు. అయితే వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ విషయంపై క్లారిటీ రాదు.