iDreamPost

ఈ 10 మందికి T20 వరల్డ్ కప్ బెర్త్ ఫిక్స్.. ఆ ఒక్కడితోనే అందరికీ టెన్షన్!

  • Published Apr 20, 2024 | 8:35 PMUpdated Apr 20, 2024 | 8:35 PM

ఐపీఎల్-2024ను ఫుల్​గా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్​కు నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్​ రూపంలో మరింత వినోదం అందనుంది. ఈ టోర్నమెంట్​ ప్రిపరేషన్స్​లో అన్ని టీమ్స్ బిజీగా ఉన్నాయి. టీమిండియా ప్లేయర్లు క్యాష్ రిచ్ లీగ్​లో ఆడటం ద్వారా పొట్టి కప్పుకు తగినట్లు సన్నద్ధమవుతున్నారు.

ఐపీఎల్-2024ను ఫుల్​గా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్​కు నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్​ రూపంలో మరింత వినోదం అందనుంది. ఈ టోర్నమెంట్​ ప్రిపరేషన్స్​లో అన్ని టీమ్స్ బిజీగా ఉన్నాయి. టీమిండియా ప్లేయర్లు క్యాష్ రిచ్ లీగ్​లో ఆడటం ద్వారా పొట్టి కప్పుకు తగినట్లు సన్నద్ధమవుతున్నారు.

  • Published Apr 20, 2024 | 8:35 PMUpdated Apr 20, 2024 | 8:35 PM
ఈ 10 మందికి T20 వరల్డ్ కప్ బెర్త్ ఫిక్స్.. ఆ ఒక్కడితోనే అందరికీ టెన్షన్!

ఐపీఎల్-2024ను ఫుల్​గా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్​కు నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్​ రూపంలో మరింత వినోదం అందనుంది. ఈ మెగా టోర్నమెంట్​ ప్రిపరేషన్స్​లో అన్ని టీమ్స్ బిజీగా ఉన్నాయి. టీమిండియా ప్లేయర్లు క్యాష్ రిచ్ లీగ్​లో ఆడటం ద్వారా పొట్టి కప్పుకు తగినట్లు సిద్ధమవుతున్నారు. త్వరలో ప్రతి దేశం తమ వరల్డ్ కప్ టీమ్​ను ప్రకటించనుంది. భారత్ కూడా దీనికి సంబంధించిన కసరత్తులను ముమ్మరం చేసింది. స్క్వాడ్​ ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సెలక్టర్లను ఆదేశించింది బీసీసీఐ. ఈ విషయం మీద పని చేస్తున్న సెలక్టర్ల బృందం ఐపీఎల్ మ్యాచ్​లను నిశితంగా పరిశీలిస్తోందట. తమ రాడార్​లో ఉన్న ప్లేయర్ల గేమ్​ను దగ్గర నుంచి గమనిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే జట్టులో 10 మంది ఎంపిక కూడా పూర్తయిందని సమాచారం.

టీ20 వరల్డ్ కప్​కు వెళ్లే జట్టులో చోటు కోసం సీనియర్ల నుంచి జూనియర్ల వరకు చాలా మంది ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. తమకు టీమ్​లో ప్లేస్ దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు. అయితే ఇప్పటికే 10 మందికి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయిందని.. వాళ్లు కరీబియన్ దీవులకు వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది. ఆ క్రికెటర్లు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ప్రపంచ కప్​లో జట్టులో ఉండటం పక్కా అని క్రికెట్ సర్కిల్స్​లో వినిపిస్తోంది. వీళ్లతో పాటు రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఐపీఎల్​లో అదరగొడుతున్న వికెట్ కీపర్/బ్యాటర్ రిషబ్ పంత్, స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లెఫ్టార్మ్ పేసర్ అర్ష్​దీప్ సింగ్, పేస్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా, హైదరాబాదీ స్పీడ్​స్టర్ మహ్మద్ సిరాజ్ కూడా పొట్టి కప్పులో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారని టాక్ నడుస్తోంది.

ఈ 10 మందికి వరల్డ్ కప్ బెర్త్ అనే వార్తలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. రోహిత్ నుంచి పంత్ వరకు, కుల్దీప్ నుంచి అర్ష్​దీప్ దాకా 8 మంది ప్లేయర్ల సెలక్షన్ సూపర్బ్ అని అంటున్నారు. వీళ్లంతా ఐపీఎల్​లో దుమ్మురేపుతున్నారని, జట్టులో తప్పక ఉండాల్సిన వారేనని చెబుతున్నారు. అయితే హార్దిక్, సిరాజ్ ఎంపిక గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాళ్లిద్దరూ ఇప్పుడు పూర్ ఫామ్​లో ఉన్నారు. టీమ్​లో వాళ్లు అవసరమా? అని క్వశ్చన్ చేస్తున్నారు. సిరాజ్ టీమిండియాతో ట్రావెల్ అవుతూ దాదాపు ప్రతి సిరీస్​లోనూ ఆడుతున్నాడు. కాబట్టి అతడి ఫామ్​పై కొంత ఆందోళన ఉన్నా తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ కెప్టెన్సీ వివాదం కారణంగా ఒత్తిడికి లోనవుతున్న పాండ్యా దాంట్లో నుంచి బయట పడటం లేదు. అతడ్ని వెస్టిండీస్​కు తీసుకెళ్లడం దండగ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ మొత్తం వ్యవహారం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి