Nidhan
గతేడాది తృటిలో చేజారింది వన్డే వరల్డ్ కప్. దీంతో త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో లెజెండ్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
గతేడాది తృటిలో చేజారింది వన్డే వరల్డ్ కప్. దీంతో త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో లెజెండ్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
గతేడాది తృటిలో చేజారింది వన్డే వరల్డ్ కప్. దీంతో త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. ఐసీసీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచి దాదాపు 11 ఏళ్లు కావొస్తోంది. దీంతో కప్పు కోసం అభిమానుల నుంచి డిమాండ్ ఎక్కువైంది. గత కొన్నేళ్లలో నాకౌట్ దాకా వెళ్లడం ఓడిపోయి రావడం భారత్‌కు అలవాటుగా మారింది. గతేడాది ఫైనల్స్‌కు వెళ్లి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ అదే టీమ్ వల్ల టైటిల్ మిస్సయింది. అయితే ఈసారి ఎలాంటి తప్పుకు ఛాన్స్ ఇవ్వొద్దని రోహిత్ సేన కోరుకుంటోంది. యూఎస్ఏ-వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న పొట్టి కప్పును ఎలాగైనా ఎగరేసుకుపోవాలని భావిస్తోంది.
టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తీసుకోవడంపై పలు విమర్శలు వచ్చాయి. ఐపీఎల్-2024లో అతడు విఫలమవడం, ఇంజ్యురీ నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టీమ్‌లోకి తీసుకొని తప్పు చేశారనే కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై తాజాగా రియాక్ట్ అయ్యాడు లెజెండ్ యువరాజ్ సింగ్. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ కాదు.. భారత్‌ను గెలిపించేది హార్దికేనని స్పష్టం చేశాడు. పాండ్యా ఓ మ్యాచ్ విన్నర్ అని.. అతడ్ని తక్కువగా అంచనా వేయొద్దన్నాడు. గతంలో టీమిండియాకు అతడు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడని, అతడి సామర్థ్యాన్ని శంకించడం కరెక్ట్ కాదన్నాడు యువీ.
‘ఓ ప్లేయర్‌ను టీమ్‌లోకి తీసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎలా ఆడారనేది సెలెక్టర్లు చూస్తారు. ఆ తర్వాత ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ను పరిగణనలోకి తీసుకొని ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. హార్దిక్ ఐపీఎల్లో సరిగ్గా ఆడలేదు. కానీ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అతడు భారత జట్టుకు అపూర్వమైన సేవలు అందించాడు. అందుకే అతడు వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉన్నాడు. మన జట్టులో హార్దిక్ ఎంతో ఇంపార్టెంట్ ప్లేయర్. పొట్టి కప్పులో పాండ్యా ఎలా బౌలింగ్ చేస్తాడనేది చాలా కీలకం. అలాగే అతడి ఫిట్నెస్ మీద కూడా అందరి దృష్టి నెలకొంది. ప్రపంచ కప్‌లో అతడు స్పెషల్‌గా ఏదో చేస్తాడని నేను భావిస్తున్నా. ఏదో మ్యాజిక్ చేసి టీమిండియాను గెలిపిస్తాడని నమ్ముతున్నా’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. మరి.. యువీ చెప్పినట్లు పాండ్యా భారత్‌ను గెలిపిస్తాడని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.