iDreamPost

వరల్డ్ కప్​లో భారత ఓపెనర్లుగా దిగేది వాళ్లిద్దరే.. పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published May 22, 2024 | 6:19 PMUpdated May 22, 2024 | 6:19 PM

టీ20 వరల్డ్ కప్​లో టీమిండియా కూర్పు ఎలా ఉండాలనే దానిపై ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇద్దర్నీ ఓపెనర్లుగా దించాలని సూచించాడు.

టీ20 వరల్డ్ కప్​లో టీమిండియా కూర్పు ఎలా ఉండాలనే దానిపై ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇద్దర్నీ ఓపెనర్లుగా దించాలని సూచించాడు.

  • Published May 22, 2024 | 6:19 PMUpdated May 22, 2024 | 6:19 PM
వరల్డ్ కప్​లో భారత ఓపెనర్లుగా దిగేది వాళ్లిద్దరే.. పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీ20 వరల్డ్ కప్-2024కు టైమ్ దగ్గర పడుతోంది. మరో 10 రోజల్లో మెగా టోర్నమెంట్​కు తెరలేవనుంది. ఇప్పటికే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్​, ఐర్లాండ్, యూఎస్​ఏ, జింబాబ్వే లాంటి దేశాలు ప్రపంచ కప్ ప్రిపరేషన్స్​లో బిజీ అయిపోయాయి. టీ20 ద్వైపాక్షిక సిరీస్​లు ఆడుతూ సన్నద్ధం అవుతున్నాయి. టీమిండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెటర్లు ఐపీఎల్-2024లో బిజీగా ఉన్నారు. క్యాష్ రిచ్​ లీగ్​ను తమ ప్రాక్టీస్ కోసం వాడుకుంటున్నారు. అన్ని జట్లు పొట్టి కప్పుపై కన్నేశాయి. వన్డే వరల్డ్ కప్-2023 తృటిలో మిస్సవడంతో టీ20 కప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని భారత్ భావిస్తోంది. అందుకోసం బలమైన స్క్వాడ్​తో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 వరల్డ్ కప్​లో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ప్రతి పొజిషన్​కు ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు అందుబాటులో ఉండటంతో ఎవర్ని ఏ స్థానంలో ఆడిస్తారనేది అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఓపెనర్లుగా ఎవరు ఆడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. లెక్కకైతే యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్​తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగాలి. అయితే ఐపీఎల్​లో ఓపెనర్​గా వచ్చి కింగ్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. దీంతో అతడ్ని ఆ స్థానంలోనే ఆడించాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై ఆసీస్ దిగ్గజం పాంటింగ్ స్పందించాడు. రోహిత్​కు జతగా విరాట్ ఓపెనర్​గా వస్తాడని.. ఇది గ్యారెంటీ అని అన్నాడు. జైస్వాల్ రూపంలో ఇంకో ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ కోహ్లీ-రోహిత్​లు ఓపెనర్లుగా రావడం పక్కా అని చెప్పాడు పాంటింగ్.

‘టీమిండియా ఓపెనింగ్ పొజిషన్ కోసం సెలెక్టర్లు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. భారత స్క్వాడ్​లో యశస్వి జైస్వాల్ రూపంలో ఆ స్థానం కోసం నిఖార్సైన లెఫ్టాండర్ ఉన్నాడు. కాబట్టి అతడ్ని ఆ రోల్​కు తీసుకోవచ్చు. అయితే నాకు మాత్రం కోహ్లీ-రోహిత్ జోడీతోనే వెళ్తారని అనిపిస్తోంది. విరాట్, సూర్యకుమార్ లాంటి ఇతర బ్యాటర్లు రాణిస్తే.. రోహిత్ మరింత రెచ్చిపోయి ఆడతాడు. అతడి స్ట్రైక్ రేట్ ఆకాశాన్ని అందుకోవడం ఖాయం. కోహ్లీ ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. అతడ్ని ఆపడం చాలా కష్టం. విరాట్​ను తక్కువ అంచనా వేయడానికి లేదు. స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదనే కారణంతో అతడ్ని నిందించడం కరెక్ట్ కాదు. కోహ్లీ లాంటి క్లాస్, ఎక్స్​పీరియెన్స్ ఉన్న ప్లేయర్​ను రీప్లేస్ చేయడం ఎవరి వల్లా కాదు’ అని పాంటింగ్ స్పష్టం చేశాడు. మరి.. టీ20 వరల్డ్ కప్​లో భారత్ తరఫున ఎవరు ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి