iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్​లో కోహ్లీని అదే పొజిషన్​లో ఆడించాలి.. రోహిత్​కు గంగూలీ సూచన!

  • Published Jun 01, 2024 | 12:01 PMUpdated Jun 01, 2024 | 12:01 PM

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్​పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్​లో కింగ్​ను ఏ స్థానంలో ఆడించాలనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. దీనిపై తాజాగా లెజెండ్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్​పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్​లో కింగ్​ను ఏ స్థానంలో ఆడించాలనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. దీనిపై తాజాగా లెజెండ్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు.

  • Published Jun 01, 2024 | 12:01 PMUpdated Jun 01, 2024 | 12:01 PM
వరల్డ్ కప్​లో కోహ్లీని అదే పొజిషన్​లో ఆడించాలి.. రోహిత్​కు గంగూలీ సూచన!

టీ20 వరల్డ్ కప్​-2024 సంరంభం మొదలవడానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. ఎంతగానో ఎదురుచూసిన క్షణాలు రావడంతో అభిమానుల సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి. మెగా టోర్నీలో అన్ని మ్యాచుల కంటే ఇండో-పాక్ సమరం కోసం ఇప్పుడు అందరూ కళ్లలో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్​ అనే కాదు.. ఈసారి ప్రపంచ కప్​లో టీమిండియా ఎంతవరకు వెళ్తుంది? కప్ కొడుతుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. వన్డే వరల్డ్ కప్-2023 కోల్పోయిన బాధలో ఉన్న రోహిత్ సేన.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పును వదలొద్దని ఫిక్స్ అయింది. అందుకే కసిగా ప్రాక్టీస్ చేస్తోంది. ఎవరెదురొచ్చినా తొక్కిపడేయాలని చూస్తోంది. కప్​ను కైవసం చేసుకొని ఫ్యాన్స్​ను సంతోషంలో ముంచెత్తాలని అనుకుంటోంది.

మెగా టోర్నీకి అన్ని రకాలుగా ప్రిపేర్ అయి వచ్చింది టీమిండియా. ఐపీఎల్-2024 వల్ల టీ20లకు బాగా అలవాటు పడ్డారు మన క్రికెటర్లు. అయితే ప్రతి పొజిషన్​కు ఒకటికి మించి ఆప్షన్లు ఉండటంతో టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఏయే స్థానాల్లో ఎవర్ని ఆడిస్తారు? ముఖ్యంగా ఓపెనర్లుగా ఎవరు దిగుతారు? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. కెప్టెన్ రోహిత్​ శర్మతో పాటు యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్​ ఓపెనర్లుగా దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున ఇదే స్లాట్​లో దిగి పరుగుల వరద పారించాడు కింగ్ కోహ్లీ. దీంతో అతడ్ని అదే స్థానంలో ఆడించాలనే డిమాండ్లు పెరిగాయి. తాజాగా భారత దిగ్గజం, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. విరాట్​ను ఓపెనర్​గా దించాలని హిట్​మ్యాన్​కు సూచించాడు.

‘టీ20 వరల్డ్ కప్​లో విరాట్ కోహ్లీని ఓపెనర్​గా ఆడించాలి. ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున ఎలాగైతే దుమ్మురేపాడో మెగా టోర్నీలో అదే స్థాయిలో కోహ్లీ చెలరేగాలని నేను కోరుకుంటున్నా. దేనికీ భయపడకుండా అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. అతడో గ్రేట్ ప్లేయర్’ అంటూ కితాబిచ్చాడు దాదా. రోహిత్ ఫామ్​ మీద కూడా గంగూలీ రియాక్ట్ అయ్యాడు. ఐపీఎల్​లో హిట్​మ్యాన్​ 417 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడు ఎలా ఆడతాడోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ.. రోహిత్ ఫామ్ గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదన్నాడు. గత వన్డే వరల్డ్ కప్​లో హిట్​మ్యాన్ ఏ రేంజ్​లో చెలరేగాడో చూశామన్నాడు. పొట్టి కప్పులో కూడా అతడు అదే రీతిలో విధ్వంసం సృష్టిస్తాడని నమ్ముతున్నానని దాదా పేర్కొన్నాడు. భారత జట్టులో క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారని, టీమ్ కప్పు కొట్టకుండా ఆపడం ఎవరి వల్లా కాదన్నాడు. మరి.. కోహ్లీని ఓపెనర్​గా దింపాలన్న దాదా సూచనపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి