Nidhan
వన్డే వరల్డ్ కప్ మిస్సైన బాధలో ఉన్న భారత జట్టు.. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మెగా టోర్నీలో టీమ్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. సంజూ శాంసన్‌కు పెద్ద బాధ్యత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
వన్డే వరల్డ్ కప్ మిస్సైన బాధలో ఉన్న భారత జట్టు.. త్వరలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మెగా టోర్నీలో టీమ్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. సంజూ శాంసన్‌కు పెద్ద బాధ్యత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Nidhan
వన్డే వరల్డ్ కప్ మిస్సైన బాధలో ఉన్న భారత జట్టు.. టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. త్వరలో జరిగే ఈ మెగా టోర్నీలో టీమ్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు పెద్ద బాధ్యత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీ నెరవేరుస్తూ వచ్చిన రెస్పాన్సిబిలిటీని సంజూకు బదిలీ చేయడానికి రంగం సిద్ధమైందట. రోహిత్ ఆలోచనకు కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమ్ మేనేజ్మెంట్ కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఇది గానీ వర్కౌట్ అయితే భారత్‌ను వరల్డ్ కప్ కొట్టకుండా ఎవరూ ఆపలేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు హిట్‌మ్యాన్ వేసిన ప్లాన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వెస్టిండీస్-యూఎస్ఏ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై పలు ఇండికేషన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు ఇన్నాళ్లూ ఆడుతూ వచ్చిన ఫస్ట్ డౌన్లో ఎవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక్కడే రోహిత్ తన బుర్రను వాడినట్లు తెలుస్తోంది. విరాట్ స్థానంలో సంజూను ఆడించాలని హిట్‌మ్యాన్ భావిస్తున్నాడట. సంజూ పేసర్లను బాగా ఎదుర్కొంటాడు. స్పిన్నర్లను ఆడటంలోనూ అతడు ఆరితేరాడు. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో కలిపి స్పిన్నర్ల బౌలింగ్‌లో 107 బంతుల్లో 145 స్ట్రైక్ రేట్‌తో 156 పరుగులు చేశాడు సంజూ. ఇందులో 11 బౌండరీలతో పాటు 6 సిక్సులు ఉన్నాయి.
ఈసారి ఐపీఎల్లో ఒక్కసారి కూడా స్పిన్నర్ల బౌలింగ్‌లో సంజూ ఔట్ అవ్వలేదు. వరల్డ్ కప్‌లో ఫస్ట్ డౌన్లో అతడ్ని ఆడించాలని రోహిత్ డిసైడ్ అవడం వెనుక ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్‌లో పిచ్‌లు చాలా స్లోగా ఉంటాయి. అక్కడ పరుగులు చేయాలంటే పేస్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే బ్యాటర్లు కావాలి. మిడిల్ ఓవర్లలో ఒకవైపు వికెట్లను కాపాడుతూనే మరోవైపు వేగంగా పరుగులు చేసే కెపాసిటీ ఉన్నవాళ్లు అవసరం. ఇవి రెండూ సంజూలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కోహ్లీలా అతడ్ని ఫస్ట్ డౌన్లో దింపి యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడించాలనేది రోహిత్ వ్యూహమని వినికిడి. మిడిల్ ఓవర్స్‌లో అతడు సక్సెస్ అయితే తర్వాత వచ్చే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దూబె మిగిలిన పనిని ఫినిష్ చేస్తారని అనుకుంటున్నాడట. ఇది తెలిసిన నెటిజన్స్.. రోహిత్ రిస్క్‌లో లాజిక్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది గానీ వర్కౌట్ అయిందా భారత్‌కు తిరుగుండదని, కప్పు కొట్టకుండా ఎవరూ ఆపరేరని చెబుతున్నారు. మరి.. వరల్డ్ కప్‌లో సంజూ ఫస్ట్ డౌన్లో దిగితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.