iDreamPost
android-app
ios-app

T20 వరల్డ్ కప్ 2024ని మొబైల్ లో ఇలా ఫ్రీగా చూసేయండి..!

  • Published May 08, 2024 | 6:31 PM Updated Updated May 08, 2024 | 6:31 PM

T20 World Cup 2024 Streaming for Free In India: వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024ని ఎలా చూడాలో? ఎక్కడ చూడాలో తెలుసుకున్నారా? మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. మీరు ఐపీఎల్ తరహాలోనే టీ20 వరల్డ్ కప్ ని కూడా ఫ్రీగా చూసేయచ్చు.

T20 World Cup 2024 Streaming for Free In India: వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024ని ఎలా చూడాలో? ఎక్కడ చూడాలో తెలుసుకున్నారా? మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. మీరు ఐపీఎల్ తరహాలోనే టీ20 వరల్డ్ కప్ ని కూడా ఫ్రీగా చూసేయచ్చు.

  • Published May 08, 2024 | 6:31 PMUpdated May 08, 2024 | 6:31 PM
T20 వరల్డ్ కప్ 2024ని మొబైల్ లో ఇలా ఫ్రీగా చూసేయండి..!

ప్రస్తుతం అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 గురించే ఆలోచిస్తున్నారు. అయితే అసలు సమరం జూన్ 2 నుంచి ప్రారంభం కాబోతోంది. అదే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్ ని సిద్ధం చేస్తున్నాయి. కొన్ని టీమ్స్ 15 మందితో కూడిన స్క్వాడ్స్ ని కూడా ప్రకటించాయి. టీమిండియా కూడా 15 మందితో కూడా తమ జట్టును ప్రకటించింది. అన్ని టీమ్స్ వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. చాలావరకు ప్లేయర్స్ ఐపీఎల్ 2024ను మంచి ప్లాట్ ఫామ్ గా వాడుకుని పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ ని ఎలా చూడాలో ఆలోచించారా?

టీ20 వరల్డ్ కప్ 2024కు సంబంధించి సమయం దగ్గర పడుతోంది. అన్నీ టీమ్స్ వాటి వాటి సన్నద్ధతలో ఉన్నాయి. టీమిండియా కూడా ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా శత్రు దర్భేధ్యమైన జట్టును ప్రకటించింది. వాళ్లంతా ఐపీఎల్లో ఇప్పటికే అద్భుతంగా రాణిస్తున్నారు. ఈసారి కప్పు కొట్టడంపై మంచి ఆశలను కూడా కలిగిస్తున్నారు. అలాగే ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం అంతా ఐపీఎల్ ని అయితే జియో సినిమాలో ఫ్రీగా చూసేస్తున్నారు. మరి.. వచ్చే వరల్డ్ కప్ ని ఎలా చూడాలి? ఎక్కడ చూడాలి? దానికి డబ్బులేమైనా కట్టాలా? అనే ప్రశ్నలు వేసుకున్నారా?

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 వెస్టిండీస్, అమెరికా దేశాల్లో జరగనుంది. కొన్ని మ్యాచులు వెస్టిండీస్ లో, మరికొన్ని మ్యాచులు అమెరికాలో జరుగుతాయి. అయితే క్రికెట్ అభిమానులకు ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ని మీరు మొబైల్ లో ఫ్రీగా చూసేయచ్చు. అవును ఎలా అయితే ఐపీఎల్ మ్యాచులను ఫ్రీగా చూస్తున్నారో.. అలాగే టీ20 వరల్డ్ కప్ 2024ను కూడా ఫోన్ లో ఫ్రీగా చూసేయచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వరల్డ్ కప్ ని మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో ఫ్రీగా చూసేయచ్చని తెలియజేసింది. ఇంకేముందు ఈ విషయం తెలిశాక క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇంక ఇండియా టీమ్ విషయానికి వస్తే.. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాలను ఎంచుకున్నారు. మిగిలిన జట్టు చూస్తే.. విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జాస్ప్రిత్ బుమ్రా, మర్మద్ సిరాజ్ మెయిన్ 11లో ఉన్నారు. రిజర్వ్ లో శుభ్ మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ ఉన్నారు. వచ్చే వరల్డ్ కప్ లో ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బీసీసీఐ ప్రణాళికలు, వ్యూహాలు రచిస్తోంది. టీ20 వరల్డ్ కప్ ని ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet