iDreamPost
android-app
ios-app

అమెరికాలో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు! కన్ఫామ్‌ చేసిన ICC

  • Published Sep 20, 2023 | 5:50 PM Updated Updated Sep 20, 2023 | 5:50 PM
  • Published Sep 20, 2023 | 5:50 PMUpdated Sep 20, 2023 | 5:50 PM
అమెరికాలో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు! కన్ఫామ్‌ చేసిన ICC

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌ 2023కు భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది టిక్కెట్లు కూడా కొనేసుకున్నారు. మ్యాచ్‌లన్నీ ఇండియాలోనే జరుగుతున్నాయ్‌ అని తెలుసు. కానీ, అమెరికాలో వరల్డ్‌ కప్‌లో మ్యాచ్‌లు ఏంటని కంగారు పడుతున్నారా? అయితే.. ఇది వన్డే వరల్డ్‌ కప్‌కు సంబంధించి కాదులేండీ.. 2024లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు సంబంధించిన విషయం. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మ్యాచ్‌లను అమెరికాలో ఐసీసీ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. డల్లాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

అమెరికాలో క్రికెట్‌ను అభివృద్ధి తోడ్పాటు కోసం అక్కడు పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఇప్పటికే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇండియా-వెస్టిండీస్‌ కూడా అమెరికాలో మ్యాచ్‌లు ఆడాయి. అమెరికాలో క్రికెట్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు అక్కడ టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహించాలని ఐసీసీ గతంలోనే భావించింది. అందులో భాగంగానే.. దాన్ని కన్ఫామ్‌ చేస్తూ.. ప్రస్తుతానికి డల్లాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌లోని మైదానాల్లో మ్యాచ్‌లకు నిర్వహణకు ఓకే చెబుతున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే.. అగ్రరాజ్యంలో తొలి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ జరుగుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రపంచ కప్ ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్! బెయిల్ మంజూరు..