iDreamPost

Hardik Pandya: ఆ విషయాన్ని సీరియస్​గా తీసుకోలేదు.. అప్పుడే వదిలేశా: హార్దిక్

  • Published Jun 02, 2024 | 3:53 PMUpdated Jun 02, 2024 | 3:53 PM

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరైన సమయంలో ఫామ్​లోకి వచ్చాడు. ఐపీఎల్​ ఫెయిల్యూర్​తో విమర్శలపాలైన ఈ స్టార్ ఆల్​రౌండర్.. పొట్టి ప్రపంచ కప్​ వేళ ఊపందుకున్నాడు,

టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సరైన సమయంలో ఫామ్​లోకి వచ్చాడు. ఐపీఎల్​ ఫెయిల్యూర్​తో విమర్శలపాలైన ఈ స్టార్ ఆల్​రౌండర్.. పొట్టి ప్రపంచ కప్​ వేళ ఊపందుకున్నాడు,

  • Published Jun 02, 2024 | 3:53 PMUpdated Jun 02, 2024 | 3:53 PM
Hardik Pandya: ఆ విషయాన్ని సీరియస్​గా తీసుకోలేదు.. అప్పుడే వదిలేశా: హార్దిక్

టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను నిన్న మొన్నటి వరకు అందరూ సూపర్​స్టార్​గా చూశారు. ఇలాంటోడు జట్టులో ఉంటే ఎన్ని వరల్డ్ కప్​లు అయినా సొంతం చేసుకోవచ్చని ప్రశంసల్లో ముంచెత్తారు. అతడి పవర్ హిట్టింగ్ ముందు ఎవరూ పనికిరారని మెచ్చుకున్నారు. అతడే భారత జట్టు భవిష్యత్తు అంటూ ఆకాశానికెత్తేశారు. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్​ టీమ్​కు రావడం, కెప్టెన్సీ చేపట్టి ఐపీఎల్​లో ఫెయిలవడంతో అతడికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. క్యాష్​ రిచ్ లీగ్​లో బ్యాటర్​గా, బౌలర్​గా అట్టర్ ఫ్లాప్ అవడంతో పాండ్యాపై ఓ రేంజ్​లో ట్రోలింగ్ జరిగింది. పొట్టి ప్రపంచ కప్​కు అతడ్ని ఎంపిక చేయొద్దంటూ డిమాండ్లూ వచ్చాయి. అదే టైమ్​లో భార్య నటాషాతో అతడి వివాహ బంధం విషయంలో పొరపచ్చాలు ఏర్పడ్డాయని వార్తలు రాసాగాయి.

ఒకవైపు విమర్శలు, మరోవైపు ట్రోలింగ్, ఇంకోవైపు భార్య నటాషాకు డివోర్స్ అంటూ అనేక ఊహాగానాలు వ్యాప్తిలోకి రావడంతో హార్దిక్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అయితే ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా తన ఆటతీరుతోనే వాటికి సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యాడు. వరల్డ్ కప్​ కోసం జోరుగా సాధన చేస్తున్న ఈ ఆల్​రౌండర్.. నిన్న బంగ్లాదేశ్​తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్​లో బాల్​, బ్యాట్​తో అదరగొట్టాడు. 23 బంతుల్లోనే 2 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 40 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. బంగ్లా బౌలర్లను అతడు ఊచకోత కోశాడు. బౌలింగ్​లోనూ 1 వికెట్ తీశాడు. దీంతో విమర్శించినోళ్లే పాండ్యాను మెచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గెలుపోటములను ఒకేతీరుగా తీసుకుంటానని.. విజయగర్వాన్ని తలకు ఎక్కించుకోనని అన్నాడు. సక్సెస్​ను సీరియస్​గా తీసుకోనని.. అప్పుడే వదిలేస్తానని చెప్పాడు.

‘సక్సెస్​ను పట్టించుకోను. వెంటనే వదిలేస్తా. బాగా ఆడినా ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయి ముందుకు సాగుతా. కష్టసమయాల్లో కూడా అలాగే ఉంటా. ఇలాంటివి సీరియస్​గా తీసుకునే అలవాటు నాకు లేదు. అలాగని వాటి నుంచి పారిపోను. ఏ సమస్య వచ్చినా నిలబడి పోరాడతా. జీవితమనే ఈ యుద్ధంలో నిరంతరం ఫైట్ చేస్తూ ఉండాలి. నిలబడి పోరాడితే తప్పకుండా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. లైఫ్ మొత్తం బ్యాడ్ డేస్ ఉండవు. మంచి రోజులూ వస్తాయి. క్లిష్టమైన పరిస్థితులను దాటి ముందుకు వెళ్తూ ఉండాలి. సక్సెస్​ను ఎంజాయ్ చేసి ముందుకు సాగాలి. దాన్ని సీరియస్​గా తీసుకోను. నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఫోకస్ పెడతా’ అని పాండ్యా స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని తెలిపాడు. మరి.. తన లైఫ్, కెరీర్ గురించి హార్దిక్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి