iDreamPost

IND vs SA: సూర్యకుమార్ అరుదైన రికార్డు.. ఏకంగా కోహ్లీ సరసన!

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అర్దశతకంతో చెలరేగాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసి అతడి సరసన నిలిచాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అర్దశతకంతో చెలరేగాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసి అతడి సరసన నిలిచాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

IND vs SA: సూర్యకుమార్ అరుదైన రికార్డు.. ఏకంగా కోహ్లీ సరసన!

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది భారత జట్టు. అందులో భాగంగా.. తొలి టీ20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే ఇక తాజాగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు. 55 పరుగులుకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో జట్టును అద్భుతమైన అర్ధశతకంతో ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే సూర్య టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సమం చేశాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు. ఓపెనర్లు జైస్వాల్(0), శుబ్ మన్ గిల్(0) దారుణంగా విఫలమైన వేళ.. తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. పేస్ పిచ్ లపై సౌతాఫ్రికా బౌలింగ్ ను ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ఇద్దరు పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మంచి ఊపుమీదున్నట్లు కనిపించిన తిలక్ ను గెరాల్డ్ కోయెట్జీ 29 పరుగుల వద్ద పెవిలియన్ కు పంపాడు. అనంతరం ఫినిషర్ రింకూ సింగ్ తో జతకట్టిన సూర్య గేర్ మార్చాడు. సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ.. కేవలం 29 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. సూర్య-రింకూ జోడీ ప్రోటీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించారు. వీరిద్దరు కలిసి 70 పరుగులు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత షంషై బౌలింగ్ లో ఔటైయ్యాడు సూర్య.

అతడు 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే సూర్య ఓ అరుదైన ఘనతను సాధించి.. విరాట్ కోహ్లీ సరసన చేరాడు. సూర్యకుమార్ అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీని రీచ్ అయ్యాడు. ఇతడు కేవలం 1164 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. దీంతో ఈ అరుదైన రికార్డు సాధించిన ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఇంతకు ముందు ఇంటర్నేషనల్ టీ20ల్లో రెండు వేల పరుగులు సాధించిన బ్యాటర్లుగా రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సూర్యకుమార్ చేరాడు. మరి సూర్య ఈ ఘనత సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి