iDreamPost

నేడు ఆకాశంలో అద్భుతం.. బ్లూ మూన్‌ను తప్పక చూడండి!

నేడు ఆకాశంలో అద్భుతం.. బ్లూ మూన్‌ను తప్పక చూడండి!

నేడు ఖగోళంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఈ రోజు రాత్రి ఆకాశంలో సూపర్‌ బ్లూ మూన్‌ అనే అరుదైన ఘట్టం చోటు చేసుకోనుంది. ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా.. దగ్గరగా మనకు కనిపించనున్నాడు. అంతేకాదు! చందమామ.. శనిగ్రహానికి చాలా దగ్గరగా రానున్నాడు. ఈ సంవత్సరం ఏర్పడ్డ మూడు సూపర్‌ మూన్‌లలో కెల్లా ఇది పెద్దదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సూపర్‌ బ్లూ మూన్‌ సందర్భంగా చంద్రుడు భూమికి 3,57,344 కిలీమీటర్ల వద్దకు రానున్నాడట. దీంతో చంద్రుడు మరింత పెద్దగా.. దగ్గరగా కనిపించనున్నాడట.

అసలు బ్లూ మూన్‌ అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది?

ఒకే నెలలో రెండు సార్లు నిండు చంద్రుడు దర్శనమివ్వటాన్ని బ్లూ మూన్‌ అంటారు. బ్లూ మూన్‌లో బ్లూ ఏంటి? అంటే.. ఆ రంగుకు చంద్రుడికి ఎలాంటి సంబంధం ఉండదు. నిండు బ్లూ మూన్‌ రెండున్నరేళ్ల కొకసారి ఏర్పడుతుంది. అదికూడా అగ్ని పర్వతాలు బద్ధలు అయినపుడు.. అడవులు తగల బడ్డపుడు వాటి పొగ, దుమ్ము పెద్ద మొత్తంలో ఆకాశంలోకి చేరినపుడు సంభవిస్తూ ఉంటుంది. నిండు చంద్రుడి కక్ష భూమికి దగ్గరగా వచ్చినపుడు ఇది ఏర్పడుతుంది.

బుధవారం రాత్రి 8.30 ప్రాంతంలో ఇండియాలో ఈ సూపర్‌ బ్లూమూన్‌ వస్తుంది. ఈ సూపర్‌ బ్లూ మూన్‌ మళ్లీ 9 ఏళ్ల తర్వాత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సూపర్‌ బ్లూ మూన్‌ను చూడ్డానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా సూపర్‌ బ్లూబూన్‌ను చూసి ఆనందించాలని అనుకుంటున్నారు. మీరు కూడా సూపర్‌ బ్లూ మూన్‌ను చూడాలనుకుంటే.. ఈ రోజు రాత్రి 8.30 వరకు ఆగాల్సిందే. మరి, 9 ఏళ్ల కొకసారి వచ్చే సూపర్‌ బ్లూ మూన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి