iDreamPost

చంద్రుడికి అతి దగ్గరగా చంద్రయాన్‌ 3.. ఫొటోలు షేర్‌ చేసిన ఇస్రో!

చంద్రుడికి అతి దగ్గరగా చంద్రయాన్‌ 3.. ఫొటోలు షేర్‌ చేసిన ఇస్రో!

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రో.. చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, చంద్రయాన్‌ 3కి సంబంధించిన విక్రమ్‌ ల్యాండర్‌ కీలక ఘట్టాలను పూర్తి చేసుకుని చంద్రుడికి మరింత చేరువైంది. చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లింది. అంతేకాదు! చంద్రుడి ఉపరితలం ఫొటోలను సైతం తీసి పంపింది. ఈ ఫొటోలను ఇస్రో బయటకు విడుదల చేసింది. ఆ ఫొటోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, మరికొన్ని గంటల్లో విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఉపరితలంపై అడుగుపెట్టనుంది.

బుధవారం సాయంత్రానికి కంతా విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపైకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్‌ ల్యాండర్‌.. చంద్రుడిపైకి విజయవంతగా చేరే చారిత్రాత్మక ఘట్టం కోసం ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు సామాన్య జనం కూడా ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్‌ ల్యాండింగ్‌కు ఎలాంటి ఇ‍బ్బందులు కలుగకుండా ఉండేలా కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌.. చంద్రుడిపై దిగటానికి అనువైన చోటు కోసం అన్వేషిస్తోంది.

అనువైన ప్రదేశం దొరకగానే చంద్రుడిపైకి దిగుతుంది. కాగా, గతంలో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 2 విఫలమైన సంగతి తెలిసిందే. ల్యాండర్‌ చంద్రుడిపైకి దిగుతూ కుప్పకూలింది. అలా చంద్రయాన్‌ 2 ఇస్రో శాస్త్రవేత్తలకు నిరాశను మిగిల్చింది. చంద్రయాన్‌ 2 వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత పగడ్బంధీగా చం‍ద్రయాన్‌ 3ను ప్రయోగించారు శాస్త్రవేత్తలు. సేఫ్‌ ల్యాండింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. మరి, బుధవారం సాయంత్రం విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి