iDreamPost

చరిత్ర సృష్టించిన సన్​రైజర్స్.. IPL హిస్టరీలో తొలి జట్టుగా రికార్డు!

Sunrisers Hyderabad Created History: ఉప్పల్ వేదికగా ముంబయితో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు చరిత్ర తిరగరాసింది. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

Sunrisers Hyderabad Created History: ఉప్పల్ వేదికగా ముంబయితో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు చరిత్ర తిరగరాసింది. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

చరిత్ర సృష్టించిన సన్​రైజర్స్.. IPL హిస్టరీలో తొలి జట్టుగా రికార్డు!

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర తిరగరాసింది. ఈ సీజన్ లో హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. హైదరాబాద్ బ్యాటర్ల ముందు ముంబయి బౌలర్లు గల్లీ క్రికెటర్లు అయిపోయారు. వారికి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా పోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి జట్టుకు ఈ మ్యాచ్ ఒక పీడకలలా మారిపోయింది. తొలి ఓవర్ నుంచి హైదరాబాద్ డామినేషన్ చూపిస్తూనే ఉంది. ముఖ్యంగా ప్రతి బౌలర్ ని టార్గెట్ చేస్తూ హెడ్, అభిషేక్, క్లాసెన్, మార్కరమ్ వీరవిహారం చేశారు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే కొత్త చరిత్ర సృష్టించింది.

ేఉప్పల్ వేదికగా జరుగుతున్న హైదరాబాద్- ముంబయి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డులు తిరగరాస్తోంది. ఈ మ్యాచ్ లో తొలుత ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు. హైదరాబాద్ జట్టు తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు అయ్యింది. ఆ రికార్డు నమోదైన 15 నిమిషాల్లోనే అభిషేక్ శర్మ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ శర్మ కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. ఈ సీజన్ లో అభిషేక్ శర్మ అత్యంత వేగంగా అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. అలాగే ట్రావిస్ హెడ్ రికార్డును బద్దలు కొట్డాడు. ఇవన్నీ పక్కన పెడితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డును బద్దలు కొట్టింది.

10 ఓవర్లలోపు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలోనే 10 ఓవర్లలోపు 148/2 పరుగులు చేసి.. హయ్యెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా అవతరించింది. గతంలో ఈ రికార్డు ముంబయి జట్టు(131) పేరిట ఉండేది. 2021లో ముంబయి ఈ స్కోర్ చేసింది. వారితో ఆడే మ్యాచ్ లో వారి రికార్డును తిరగరాశారు. పంజాబ్ 2014లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 2008లో డెక్కన్ ఛార్జెస్ 130 పరుగులు, 2016లో ఆర్సీబీ 129, 2013లో ఆర్సీబీ 128, 2023లో లక్నో 10 ఓవర్లలోపు 128 పరుగులు చేసింది. 2015లో చెన్నై జట్టు 128/2 పరుగులు చేసింది. ఈ విధంగా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.

ఇది మాత్రమే కాకుండా.. 20 ఓవర్లకు అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టు పేరిట ఉన్న 263 పరుగుల రికార్డును హైదరాబాద్ జట్టు బద్దలు కొట్టింది. ఈ రికార్డు, మ్యాచ్ స్కోర్ తో కావ్య మారన్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. అలాగే సన్ రైజర్స్ జట్టు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సార్ హైదరాబాద్ జట్టు రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక మ్యాచ్ లో హైదరాబాద్ ప్లేయర్లు చాలానే రికార్డులు క్రియేట్ చేశారు. కొన్ని అరుదైన రికార్డులను బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత ప్రతి తెలుగు అభిమాని గర్వంగా ఇది మా టీమ్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి.. హైదరాబాద్ జట్టు తిరగరాసిన చరిత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి