iDreamPost

సుజనా చౌదరి కి షాక్.. ఆస్తుల వేలానికి రంగం సిద్ధం..

సుజనా చౌదరి కి షాక్.. ఆస్తుల వేలానికి రంగం సిద్ధం..

బ్యాంకుల నుండి రుణం తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎగొట్టి బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ షాక్ ఇచ్చింది. సుజనా చౌదరి ఆస్తులను మార్చి 23 న ఇ-వేలం వేయనున్నట్లు ప్రకటించింది. వేలంలో పాల్గొనే వారు తనఖా పెట్టిన ఆస్తులను ఈ నెల 20లోపు పరిశీలించుకోవచ్చని తెలిపింది.

గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సుజనా చౌదరి తన సోదరుడు జతిన్, స్నేహితుడు గొట్టిముక్కల శ్రీనివాస రాజు పూచీకత్తు మీద సుజనా యునివర్సల్ సంస్థ పేరు మీదా 2018 అక్టోబర్ 26 న ఆస్తులు తనఖా పెట్టి 13.98% వడ్డీకి 322 కోట్ల రుపాయాలు రుణం తీసుకున్నారు. ఆ రుణాన్ని రాజదాని అమరావతి పరిధిలో భారీ ఎత్తున భూములు కొనడానికి రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారని, ఈ విధంగా 2017-18 సంవత్సారాల లో సుజనా చౌదరి కుటుంబ సభ్యులు పేరు మీద 623 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తాము గుర్తించినట్టు బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. దీనిపై బ్యాంకు సిబిఐ కి ఫిర్యాదు చేసింది. సుజానా పై కేసు నమోదవడంతో త్వరలోనే సిబిఐ విచారణ మొదలుకానుంది.

బ్యాంకుల దగ్గర షుమారు 8 వేల కోట్లు అప్పులు తీసుకోని నిధులను దారి మళ్లించి బ్యాంకులకు రుణం ఎగ్గొట్టిన ఆరోపణల పై ఇప్పటికే సుజనా పై నమోదయిన ఆర్ధిక నేరాల కేసుల్లో విచారణ వేగవంతమైంది. గతం లో కుడా ఇదేవిధంగా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా కుడా సుజానా పై సిబిఐ కి ఫిర్యాదు చేసింది. గతంలో సుజానా వెస్ట్రన్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ పేరుతో తప్పుడు ధృవ పత్రాలు సృష్టించి కృష్ణా జిల్లా చందర్లపాడు వద్ద 110ఎకరాల్లో శివశక్తి పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు తో 304కోట్లు రుణం తీసుకుని ఆ డబ్బుతో రాజధానిలో భూములు కొన్నారని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధారాలతో సహ సిబిఐ కి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే దీనిపై సిబిఐ విచారణని వేగవంతం చేసింది.

2004 నుండి 2014 మధ్య సుజనా చౌదరి వివిద బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని వాటిని ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించి తెలుగుదేశం పార్టీ కోసం భారీగా ఖర్చు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో అమరావతిలో వేల కోట్ల ఆస్తులు కొన్న సుజనా చౌదరి పై ప్రభుత్వం కేసులు నమోదు చేసి ఈడి కి ఆధారాలు అందించిన తరుణంలోనే బ్యాంకులు కుడా సుజనా చౌదరి చుట్టు ఉచ్చు బిగిస్థున్నాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సుజనా కి కేంద్రం నుండి సహాయ సహకారాలు లభించడం కూడా కష్టమే!! ఇక సుజనా కి దారులన్ని ముసుకుపొయినట్టెనని తెలుగుదేశం నేతలు సైతం తమ అంతర్గత సంభాషణలలొ ముచ్చటించుకుంటున్నారట!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి