iDreamPost

3.5 లక్షలకే ఎలక్ట్రిక్ కారు .. సింగిల్ ఛార్జ్ తో 200KM రేంజ్

ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. అయితే వీటి ధర ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. అయితే వీటి ధర ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవచ్చు.

3.5 లక్షలకే ఎలక్ట్రిక్ కారు .. సింగిల్ ఛార్జ్ తో  200KM రేంజ్

ప్రస్తుత కాలంలో సొంత కారు ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. దాంతో పాటు అంతగా సౌకర్యవంతంగా ఉండదు. సొంతవాహనమైతే ఏ ఇబ్బంది ఉండదు. ఇటీవల మార్కెట్ లోకి ఆటోమొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిన తర్వాత ఎలక్ట్రిక్ కార్లు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. ఓ ఎలక్ట్రిక్ కారు మాత్రం అతి తక్కువ ధరకే లభిస్తోంది. 3.5లక్షలకే ఎలక్ట్రిక్ కారును మీ సొంతం చేసుకోవచ్చు.

ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా ఆటోమొబైల్ కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీతో అదిరే ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. సాధారణంగా కారును కొనాలంటే కనీసం 5లక్షలపైగానే ఉండాలి. అదే ఎలక్ట్రిక్ కారు అయితే దాదాపు రూ.10 లక్షలు ఉండాల్సిందే. కానీ ఈ ఎలక్ట్రిక్ కారు మాత్రం అతి తక్కువ ధరకే అంటే 3.5 లక్షలకే వస్తోంది. అదిరిపోయే ఫీచర్లు కూడా ఈ కారు సొంతం. చైనాకు చెందిన స్మాల్ ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీ జిడో తాజాగా కొత్త కారును ఆవిష్కరించింది. దీని పేరు రెయిన్‌బో మిని ఈవీ. ఈ కారు సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 200 కి.మీల దూరం ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

అయితే ఈ రెయిన్‌బో మిని ఈవీ ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. పింక్, పర్పుల్, బ్రౌన్ , యెల్లో, సియాన్, గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లు ఉన్నాయి. చూడ్డానికి చిన్నగా ఉన్న ఈ కారు వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. ఇందులో పింక్ బ్యాక్ గ్రౌండ్, డబుల్ స్పోక్ స్ట్రీరింగ్ వీల్, 5 ఇంచుల ఫుల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 9 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫిజికల్ బటన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో మొబైల్ ఫోన్ రిమోట్ వెహికల్ కంట్రోల్ ఉంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. 9.98 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కారు అయితే 125 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. అదే 17.18 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కారు అయితే 205 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 17.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్న కారు అయితే 201 కీలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి