iDreamPost
android-app
ios-app

వీడియో: లీకైన టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?

  • Published May 06, 2024 | 7:43 PM Updated Updated May 06, 2024 | 7:43 PM

T20 World Cup Team India jersey: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీ ఇదేనంటూ.. సోషల్ మీడియాలో ఓ జెర్సీ వైరల్ గా మారింది. ఆ జెర్సీ ఎలా ఉంది? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

T20 World Cup Team India jersey: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీ ఇదేనంటూ.. సోషల్ మీడియాలో ఓ జెర్సీ వైరల్ గా మారింది. ఆ జెర్సీ ఎలా ఉంది? ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published May 06, 2024 | 7:43 PMUpdated May 06, 2024 | 7:43 PM
వీడియో: లీకైన టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే?

టీ20 వరల్డ్ కప్ 2024.. ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టంతా ఈ మెగాటోర్నీపైనే ఉంది. ఐపీఎల్ జరుగుతున్నప్పటికీ.. పొట్టి ప్రపంచ కప్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం అయ్యే ఈ మహా సంగ్రామం కోసం 20 జట్లు సిద్దమైయ్యాయి. ఎలాగైనా ఈసారి కప్ కొట్టాలని అన్ని జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇక ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా వరల్డ్ కప్ జెర్సీ ఇదేనంటూ లీకైన ఓ జెర్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ జెర్సీపై ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? చూద్దాం పదండి.

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఎలాంటి జెర్సీ ధరిస్తుందా? అని ప్రతీ ఒక్క క్రికెట్ ప్రేమికుడు ఎదురుచూస్తున్నాడు. అయితే ఇలాంటి టైమ్ లో పొట్టి ప్రపంచ కప్ లో భారత ఆటగాళ్లు ధరించే జెర్సీ ఇదేనంటూ ఓ జెర్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లీకైన టీమిండియా జెర్సీ నీలం, నారింజ రంగులో ఉంది. భుజాలపై అడిడాస్ మూడు చారలు తెలుపు రంగులో కనిపిస్తాయి. ముందు భాగంలో జెర్సీ నీలం రంగులో ఉంది. డ్రీమ్ 11 లోగోతో పాటుగా ఇండియా అనే పేరు నారింజ రంగులో ఉంది. ఒకవైపు బీసీసీఐ లోగో అయితే మరోవైపు అడిడాస్ లోగో ఉంది.

ఇక ఈ లోగోను చూసిన అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమిండియా జెర్సీ ఇదే అయితే.. బీసీసీఐ సెలెక్షన్ పరమ వరస్ట్, ఈ జెర్సీ చూసి నేను షాక్ అయ్యాను, చాలా చడ్డగా ఉంది, బహుశా ఇది టీమిండియా ట్రైనింగ్ జెర్సీ అనుకుంటా అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మెుత్తానికి ఈ లీకైన జెర్సీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఈ జెర్సీపై ఎలాంటి అధికారిక వీడియో అయితే పోస్ట్ చేయలేదు. మరి ఈ జెర్సీ మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom