iDreamPost

వీడియో: పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు! ఒక్కరాత్రిలోనే అంతా!

Child Kidnapping Gang Busted at Delhi: డబ్బు సంపాదనే లక్ష్యందా కొంతమంది ఎన్నో దారుణాలు, మోసాలకు తెగబడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తూనే ఉన్నారు.

Child Kidnapping Gang Busted at Delhi: డబ్బు సంపాదనే లక్ష్యందా కొంతమంది ఎన్నో దారుణాలు, మోసాలకు తెగబడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తూనే ఉన్నారు.

వీడియో: పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు! ఒక్కరాత్రిలోనే అంతా!

ఈ మధ్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో రకాలు దారుణాలకు తెగబడుతున్నారు. తక్కవ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లగ్జరీ జీవితాన్ని గడపాలని చూసేవారు ఎదుటి వారిని మోసం చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు.డ్రగ్స్, అక్రమాయుధాలు, హైటెక్ వ్యభిచారం, పిల్లలను కిడ్నాప్ చేయడం ఇలా ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతూ డబ్బు సంపాదిస్తున్నారు. నేరం చేసిన వాళ్లు ఎంతోకాలం తప్పించుకోలేరు.. ఏదో ఒక సమయంలో పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్తుంటారు. డబ్బు కోసం పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ అధికారులు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో పిల్లలను కిడ్నాప్ చేస్తూ అమ్ముతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు సెంట్రల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (సీబీఐ) అధికారులు. కొంత కాలంగా పిల్లలను అక్రమ రవాణా చేస్తున్నట్లు సీఐబీకి సమాచారం అందింది.ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పసి పిల్లలతో సహా 10 ఏళ్ల లోపు పిల్లలను దొంగిలించి అక్రమ రవాణా చేస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలు సంపాదించి ఢిల్లీలోని కేశవపురంలోని ఓ ఇంటిపై రైడ్ చేసి ఇద్దరు నవజాతి శిశువులను సీబీఐ బృందం స్వాధీనం చేసుకుంది. హాస్పిటల్స్ లో కొంతమందితో కలిసి ఈ గుడుపుటానీ చేస్తున్నారు నింధితులు.

ఇప్పటి వరకు ఎనిమిది మంది చిన్నారులను రక్షించారు సీబీఐ బృందం. సోదాల్లో భాగంగా ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో పనిచేస్తున్న నీరజ్ అనే వార్డు బాయ్, ఇందు నే మహితో పాటు పలువురు నింధితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ గ్యాంగ్ కొన్ని ఆస్పత్రుల్లో నవజాతి శిశువులను అపహరించి అక్రమ రవాణా చేస్తూ లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి ద్వారక, నార్త్ వెస్ట్ జిల్లా, ఢిల్లీలోని రోహిని ప్రాంతంలోని సహా ఎన్ సీఆర్ కు చెందిన పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి