iDreamPost

కారు కొనాలనుకుంటున్నారా? ఈ బ్యాంకు నుంచి 90 శాతం రుణం! వారికి మాత్రమే!

  • Published Feb 24, 2024 | 8:03 PMUpdated Feb 24, 2024 | 8:03 PM

EV Cars: ఇప్పుడు ఎలెక్ట్రిల్ కార్స్ కొనుగోలు చేయాలి అనుకునే వారికీ చేతిలో డబ్బులు లేకపోయినా పర్లేదు..కేవలం కొనుగోలు చేసే ఇంట్రెస్ట్ ఉంటె సరిపోతుంది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలెక్ట్రిక్ కార్స్ కొనుగోలు చేసేందుకు ప్రత్యేకమైన రుణాలను అందిస్తుంది.

EV Cars: ఇప్పుడు ఎలెక్ట్రిల్ కార్స్ కొనుగోలు చేయాలి అనుకునే వారికీ చేతిలో డబ్బులు లేకపోయినా పర్లేదు..కేవలం కొనుగోలు చేసే ఇంట్రెస్ట్ ఉంటె సరిపోతుంది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలెక్ట్రిక్ కార్స్ కొనుగోలు చేసేందుకు ప్రత్యేకమైన రుణాలను అందిస్తుంది.

  • Published Feb 24, 2024 | 8:03 PMUpdated Feb 24, 2024 | 8:03 PM
కారు కొనాలనుకుంటున్నారా? ఈ బ్యాంకు నుంచి 90 శాతం రుణం! వారికి మాత్రమే!

చాలా మందికి సొంత వాహనాలను కొనుగోలు చేయాలనే ఆశ ఉంటుంది . కానీ, కుటుంబ బాధ్యతల కారణంగా అనుకున్న వాటిని కొనుగోలు చేయలేకపోతారు. ఇక ఇప్పుడైతే.. ఎలెక్ట్రిక్ కార్ల యుగం వచ్చింది. పెట్రోల్, డీజిల్ తో కూడా వీటికి సంబంధం లేదు. కాబట్టి చాలా మంది వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, కొన్ని కారణాల వలన దీనిని కొనేందుకు ముందుకు రాలేకపోతున్నారు. అయితే, అటువంటి వారి కోసం .. బ్యాంకులు కూడా అనేక ఆఫర్లు తీసుకుని వస్తున్నాయి. అందులోను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకించి ఈ ఎలెక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయడం కోసం.. ప్రత్యేకమైన కన్సెషన్ తో పాటు, భారీ తగ్గింపును కూడా ఇస్తుంది. కాబట్టి ఎలెక్ట్రిక్ కార్స్ కొనుగోలు చేయాలి అనుకునే వారు ఈ లోన్ ను తీసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు అన్నిటికంటే ప్రసిద్ధమైన ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. అందులోను.. ఎలక్ట్రిక్‌ కారు రుణాలపైన ఉండే వడ్డీపై.. వాహన రుణాలకు 0.25% ప్రత్యేక తగ్గింపును కూడా అందజేస్తున్నారు. అయితే సహజంగా ఎలక్ట్రిక్ కారు ఆన్-రోడ్ ధరలో 90 % వరకు రుణాన్ని పొందవచ్చు. పైగా కొన్ని ప్రత్యేక మోడల్స్ అయితే, 100% లోన్ సదుపాయం అందించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలెక్ట్రిక్ కార్స్ ను కొనడానికి డబ్బులు లేకపోయినా .. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం .. నార్మల్ కార్స్ పై .. 8.85 నుంచి 9.80 శాతం వరకు రుణం ఇస్తోంది. ఇప్పుడు ఎలెక్ట్రిక్ కార్స్ పై ప్రత్యేక ఆఫర్ ఉంది కాబట్టి.. ఎలక్ట్రిక్ కార్లపై 8.75 నుండి 9.45 శాతం వడ్డీ రేటుతో రుణాలను అందిస్తోంది.

అయితే, దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే.. వారి కనీస వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు ఉన్నట్లయితే.. బ్యాంకు వారు సరిగ్గా 48 రెట్లు కారు రుణాన్ని ఇవ్వగలరు. వ్యవసాయం, వ్యాపార రంగాలలో ఉన్న వ్యక్తులకైతే.. వారి వార్షిక ఆదాయం కనీసం రూ.4 లక్షలు ఉండాలి. ఇక ఋణం తీసుకునేటప్పుడు.. కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. ఎవరైనా నెల వారి జీతం తీసుకునే వ్యక్తి అయ్యి ఉండి.. ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే.. గత 6 నెలలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను వారికీ అందించాలి. దానితో పాటు .. రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు, గుర్తింపు కార్డు, అలాగే దానికి సంబంధించిన అన్ని వివరాలను వారికీ అందించాలి. కాబట్టి, ఎలెక్ట్రిక్ కార్స్ కొనుగోలు చేయాలి అనుకునే వారికీ .. ఇదొక గొప్ప అవకాశం అని చెప్పి తీరాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి