iDreamPost

స్టార్ కమెడియన్ భార్యని అవమానిస్తూ ట్రోల్స్.. నటి ఎమోషనల్ రిప్లయ్!

Redin kingsley Wife emotional: ప్రముఖ కమెడియన్, జైలర్ నటుడు రెడిన్ కింగ్స్ లే భార్య సంగీత ఎమోషనల్ అయ్యింది. తాను డబ్బు కోసమే రెడిన్ ని వివాహం చేసుకుందంటూ విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

Redin kingsley Wife emotional: ప్రముఖ కమెడియన్, జైలర్ నటుడు రెడిన్ కింగ్స్ లే భార్య సంగీత ఎమోషనల్ అయ్యింది. తాను డబ్బు కోసమే రెడిన్ ని వివాహం చేసుకుందంటూ విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

స్టార్ కమెడియన్ భార్యని అవమానిస్తూ ట్రోల్స్.. నటి ఎమోషనల్ రిప్లయ్!

ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్ పెళ్లిళ్లు చేసుకోవడం సర్వ సాధారణం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు వారి సహ నటులను ప్రేమించి వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి పెళ్లిళ్లు ఆడియన్స్ ని ఆనందానికి గురి చేస్తే కొన్ని మాత్రం విమర్శల పాలు అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వివాహంపై నెట్టింట ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి. అలాంటి విమర్శలు, నెగిటివ్ కామెంట్స్ కు రియాక్ట్ అవుతూ ఆ నటి కన్నీళ్లు పెట్టుకుంది. అసలు తమను అలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నించింది. వాస్తవం తెలియకుండా ఎందుకు అలాంటి కామెంట్స్ చేస్తారు అంటూ ప్రశ్నించింది.

ఇప్పుడు చెప్పుకుంటోంది జైలర్ మూవీలో చేసిన స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్స్ లే జంట గురించే. రెడిన్ కింగ్స్ లేకి ప్రముఖ నటి సంగీతను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 46 ఏళ్ల వయసులో రెడిన్ కింగ్స్ లే ప్రేమించి, నటి సంగీతను వివాహం చేసుకున్నాడు. అప్పడు ఆ వార్త కోలీవుడ్ లో కాస్త ఎక్కువగానే వైరల్ అయ్యింది. వివాహం తర్వాత తన భార్యతో కలిసి తన మొదటి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే సంగీతకు ఇది మొదటి వివాహం కాదు. ఆమెకు గతంలో ఆమెకు క్రిష్ తో వివాహం జరిగింది. వాళ్లిద్దరకీ ఒక పాప కూడా ఉంది. అయితే నెట్టింట సంగీతపై చాలా విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. అవేంటంటే. డబ్బుకోసమే రెడిన్ ని సంగీత పెళ్లి చేసుకుందని ఆరోపించారు. ఆ ట్రోల్స్ కి సంగీత సమాధానం చెప్పింది.

Star Comedian

సంగీత మాట్లాడుతూ.. “అందరూ ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా అంటున్నారు. చెప్తే కాస్త విడ్డూరంగా ఉంటుంది. కానీ, మానసికంగా నా వయసు 18, ఆయన వయసు 22 మాత్రమే. మేము ఇద్దరం ఆ ఏజ్ లోనే ఉన్నట్లు ఫీలవుతూ ఉంటాం. చాలా మంది నేను డబ్బు కోసమే రెడిన్ ని పెళ్లి చేసుకున్నాను అంటూ విమర్శిస్తున్నారు. కాస్త అది ఎలాగో నాకు అర్థమయ్యేలా చెప్తారా? నేను రెడిన్ కింగ్స్ లే సింపుల్ గా ఉండే విధానం నచ్చే ఆయనను ప్రేమించి పెళ్లాడాను” అంటూ సంగీతం సమాధానం చెప్పింది. తనపై వచ్చే ట్రోల్స్ కి సంబంధించి ఆమె ఎమోషనల్ అయ్యింది. అలాంటి విమర్శలు చేయడం తగదు అన్నట్లుగా తాను సమాధానం చెప్పింది.

ఇంక రెడిన్ విషయానికి వస్తే.. ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. చాలా తమిళ్ డబ్బింగ్ సినిమాల్లో నటించి మెప్పించాడు. పాన్ ఇండియా తెలుగు సినిమాల్లో కూడా కమెడియన్ గా యాక్ట్ చేశాడు. ఇంక బీస్ట్, జైలర్, డాక్టర్, కంజురింగ్ కన్నప్పన్ వంటి సినిమాల్లో రెడిన్ కామెడీకి కడుపు చెక్కలయ్యేలా నవ్వేస్తారు. గ్యాప్ లేకుండా అతను చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు కూడా అతనికి ఫ్యాన్స్ గా మారిపోయారు. మరి.. రెడిన్- ఆయన భార్య సంగీతపై ట్రోల్స్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి