iDreamPost

Ind vs SL: భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన శ్రీలంక

వన్డే వరల్డ్ కప్ లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడినటువంటి ఆరు లీగ్ మ్యాచ్ లలో విజయ భేరి మోగించి అజేయ భారత్ గా సరికొత్త హిస్ట్రీని క్రియేట్ చేసింది. కాగా ప్రపంచకప్ లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది.

వన్డే వరల్డ్ కప్ లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడినటువంటి ఆరు లీగ్ మ్యాచ్ లలో విజయ భేరి మోగించి అజేయ భారత్ గా సరికొత్త హిస్ట్రీని క్రియేట్ చేసింది. కాగా ప్రపంచకప్ లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది.

Ind vs SL: భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన శ్రీలంక

వన్డే వరల్డ్ కప్ లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడినటువంటి ఆరు లీగ్ మ్యాచ్ లలో విజయ భేరి మోగించి అజేయ భారత్ గా సరికొత్త హిస్ట్రీని క్రియేట్ చేసింది. కాగా ప్రపంచకప్ లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత బౌలర్లు విజృంబించి బౌలింగ్ చేయడంతో ఆ జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది.

టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు సందిస్తూ లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వచ్చిన వారిని వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టించారు. 11 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసిందంటే శ్రీలంక ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిస్సంక, కరుణరత్న, సమరవిక్రమ, హేమంత్ డకౌట్ అయ్యారు. భారత పేస్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు తడబడిపోయారు. మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా 1 వికెట్, షమీ 2 వికెట్లు తీసి లంక పతనానికి బాటలు వేశారు.

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన రోహిత్ సేన లంక బౌలర్లను వణికించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్, గిల్ జట్టుకు మంచి ఆరంభం అందించే క్రమంలో మదుశనక వేసిన తొలి ఓవర్ మొదటి బంతికి హిట్ మ్యాన్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండో బంతికి రోహిత్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన కింగ్ కోహ్లీ(88) తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. గిల్(92) శ్రేయస్ అయ్యర్(82) మెరుపు బ్యాటింగ్ తో జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఈ క్రమంలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక 12 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 22 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి