iDreamPost

భారత్ లో అత్యంత ఖ‌రీదైన టీ. అక్ష‌రాల‌ రూ.1.50 లక్ష‌లు!

Most Expensive Tea in India: దేశంలో తిండి లేకున్నా ఉంటారు కానీ.. టీ లేకుండా ఉండలేం అనేవారు చాలా మంది ఉన్నారు. ఉదయం లేచిన మొదలు.. పడుకునే వరకు ఎదో ఒక విధంగా చాయ్ తాగుతారు.

Most Expensive Tea in India: దేశంలో తిండి లేకున్నా ఉంటారు కానీ.. టీ లేకుండా ఉండలేం అనేవారు చాలా మంది ఉన్నారు. ఉదయం లేచిన మొదలు.. పడుకునే వరకు ఎదో ఒక విధంగా చాయ్ తాగుతారు.

భారత్ లో అత్యంత ఖ‌రీదైన టీ. అక్ష‌రాల‌ రూ.1.50 లక్ష‌లు!

భారత దేశంలో ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఏదో ఒక సమయంలో చాయ్, కాఫీ లాగిస్తుంటారు. నిద్ర మత్తు వదులుతుందని కొందరు.. చాయ్ తాగితే మనసు, మెదడు ఉత్తేజంగా ఉంటుందని మరికొందరు ఇలా ఏదో ఒక విధంగా చాయ్ తాగుతుంటారు. చాయ్ లో ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. వాస్తవానికి భారతీయులకు ఒకప్పుడు చాయ్ గురించి పెద్దగా తెలియదు. భారత్ లోకి అడుగు పెట్టిన బ్రిటీష్ వారు ఈశాన్య ప్రాంతంలో టీ ఉత్పత్తి ప్రారంభించారు. దేశంలో పలు ప్రాంతాల్లో టీ ఆకుల పెంపకాన్ని మొదలు పెట్టారు. నాటి నుంచి దేశంలో ప్రతి ఒక్కరికీ టీ అలవాటైంది. ప్రస్తుతం భారత దేశంలో టీ పొడి అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది.

దేశంలో టీ, కాఫీ ఇష్టపడని వారు ఉండరు. దేశంలో చాలా మంది తమ దినసరి కార్యక్రమాలు టీ, కాఫీతోనే మొదలు పెడతారు. టీ తాగితే ఎంతో రిలాక్స్ గా ఉంటుందని.. ఆకలి కలగకుండా చేస్తుందని అంటుంటారు. కొంతమంది మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటలు టీని లాగిస్తుంటారు. మామూలుగా ఇండ్లల్లో వాడే టీ పొడి ధర రూ.100 నుంచి రూ.500 వరకు ఉంటుంది. కానీ ఓ ప్రదేశంలో టీ ధర గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక కిలో టీ పొడి ధర అక్షరాలా రూ.1.50 లక్షలు. మీరు వింటున్నది నిజమే.. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో భారత్ లోనే అత్యంత ఖరీదైన టీ దొరుకుతుంది.

టీ పొడి ఇంత ఖరీదు ఏంటా? అని ఆశ్చర్యపోతున్నారా! దాని వెనుక బలమైన కారణం ఉంది. ఈ టీ పొడి అంత ఖరీదు ఉండటానికి గల కారణం ప్రత్యేకమైన నాణ్యత, రుచి. ఈ టీ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. జీవితంలోఒక్కసారైనా ఈ టీ తాగాలని కొంతమంది జనాలు పరితపిస్తారట. ఈ టీ రుచి చూడాలనుకునే వారు డార్జిలింగ్ లోని ఎప్పుడూ సందడిగా ఉండే మాల్ రోడ్డ ప్రాంతంలో ఒక దుఖానానికి వెళ్లాల్సిందే. ఆ ప్రాంతంలో ఈ ప్రత్యేక టికి ఎంతో డిమాండ్ ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి