iDreamPost

SRH vs MI: అభిషేక్ శర్మ ఊరమాస్ బ్యాటింగ్.. హెడ్​ను మించిన విధ్వంసం ఇది!

  • Published Mar 27, 2024 | 8:36 PMUpdated Mar 27, 2024 | 8:44 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒకరితో పోటీపడి ఒకరు ఆడుతున్నారు. విధ్వంసక బ్యాటింగ్​తో ముంబై బౌలర్లను ఊచకోత కోస్తున్నారు.

సన్​రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒకరితో పోటీపడి ఒకరు ఆడుతున్నారు. విధ్వంసక బ్యాటింగ్​తో ముంబై బౌలర్లను ఊచకోత కోస్తున్నారు.

  • Published Mar 27, 2024 | 8:36 PMUpdated Mar 27, 2024 | 8:44 PM
SRH vs MI: అభిషేక్ శర్మ ఊరమాస్ బ్యాటింగ్.. హెడ్​ను మించిన విధ్వంసం ఇది!

సన్​రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒకరితో పోటీపడి ఒకరు ఆడుతున్నారు. విధ్వంసక బ్యాటింగ్​తో ముంబై బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. తొలి మ్యాచ్​లో కొద్దిలో ఓడిపోవడంతో కసి మీద ఉన్న ఎస్​ఆర్​హెచ్.. ముంబై మీద తన ప్రతాపం చూపిస్తోంది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​కు సూపర్బ్ స్టార్ట్ దొరికింది. మయాంక్ అగర్వాల్ (11) త్వరగా ఔటైనా.. ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 62) థండర్ ఇన్నింగ్స్​తో చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకొని ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఎస్​ఆర్​హెచ్​ బ్యాటర్​గా నిలిచాడు హెడ్. అయితే ఆ రికార్డు కొద్దిసేపే నిలిచింది. అతడికి తోడుగా అదరగొడుతున్న అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63) హెడ్ రికార్డును తుడిపేశాడు. 16 బంతుల్లోనే ఫిప్టీ రన్స్ బాదేశాడు అభిషేక్. హెడ్​ను మించిన బ్యాటింగ్ విధ్వంసం అతడిది.

డొమెస్టిక్ క్రికెట్​లో అదరగొడుతున్న అభిషేక్ శర్మ.. ఐపీఎల్​లో రెండో మ్యాచ్​లోనే తన సత్తా ఏంటో చూపించాడు. ఈ మ్యాచ్​లో 3 బౌండరీలు బాదిన అతడు మొత్తం సిక్సుల్లోనే డీల్ చేశాడు. ఏకంగా 7 భారీ సిక్సులు బాదాడతను. కొత్త బౌలర్ మఫాకాతో పాటు సీనియర్ స్పిన్నర్ పీయుష్​ చావ్లాను టార్గెట్ చేసుకొని హిట్టింగ్​కు దిగాడు అభిషేక్. హెడ్ ఆడుతున్నంత సేపు కూల్​గా ఆడిన ఈ యంగ్ బ్యాటర్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హిట్టింగ్ చేసే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. సిక్సులు కొట్టడమే పనిగా పెట్టుకొని ముంబై బౌలర్లకు ఓ రేంజ్​లో పోయించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి