టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ వైట్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని సూచించాడు పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్. అప్పుడే అతడు మరిన్ని రికార్డులను సాధించగలడని, అలాగే సచిన్ టెండుల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగలడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక అక్తర్ వ్యాఖ్యలపై స్పందించాడు టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ. అతడికి ఒకే ఒక్క మాట ద్వారా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు దాదా. ఇంతకీ దాదా ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా మాజీ సారథి, రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవలే ఓ స్పోర్ట్స్ ఛానల్ తో అక్తర్ మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీ తనపై ఒత్తిడిని తగ్గించుకోవాలని అంటే ఈ వన్డే వరల్డ్ కప్ తర్వాత వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలి. వన్డేలకు, టీ20లకు కోహ్లీ తన శక్తిని ఖర్చు చేస్తున్నాడు. ఇక విరాట్ కనీసం మరో 6 సంవత్సరాలు ఆడితే గానీ సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టలేడు. సచిన్ రికార్డు బ్రేక్ చేసే సత్తా కోహ్లీలో ఉంది. ఇలా జరగాలి అంటే విరాట్ టెస్ట్ క్రికెట్ పై దృష్టి పెట్టాలి” అంటూ అభిప్రాయా పడ్డాడు అక్తర్.
ఇక ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు టీమిండియా దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. గంగూలీ మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీ వైట్ బాల్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలని సూచించిన అక్తర్ వ్యాఖ్యలను నేను అంగీకరించను. ఇక కోహ్లీ ఏ ఫార్మాట్ లో ఆడాలనుకున్నా.. ఆడతాడు. ఎందుకుంటే అతడు ఆడగలడు కాబట్టి. ఇలాంటి చౌకబారు సూచనలు పట్టించుకోవద్దని” దాదా పేర్కొన్నాడు. మరి షోయబ్ అక్తర్ అన్నట్లుగా విరాట్ కోహ్లీ వైట్ బాల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తేనే మంచిదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: కోహ్లీతో ఫొటో దిగిన అనుష్క! నీచమైన కామెంట్లతో రెచ్చిపోయారు..