iDreamPost

ఇకపై ప్రతి సిగరెట్ మీద పొగ త్రాగరాదు అనే హెచ్చరిక..

ఇకపై ప్రతి సిగరెట్ మీద పొగ త్రాగరాదు అనే హెచ్చరిక..

సిగరెట్ తాగేవాళ్ళని ప్రభుత్వం అన్ని రకాలుగా హెచ్చరిస్తూనే ఉంది. సిగరెట్ తాగడం వాళ్ళ క్యాన్సర్, నోటికి సంబంధించిన వ్యాధులు వస్తాయని అన్ని చోట్ల ప్రచారం చేస్తుంది. సినిమా థియేటర్స్ లో, సిగరెట్ ప్యాకెట్స్ మీద సిగరెట్ తాగొద్దు అని ప్రచారం చేసినా తాగేవాళ్ళు మాత్రం తాగుతూనే ఉన్నారు. అనేక మంది ప్రతి సంవత్సరం సిగరెట్స్ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.

ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ ఆరోగ్యానికి హానికరం, పొగ త్రాగరాదు అని హెచ్చరికలతో కూడిన ప్రింటింగ్ ఉంటుంది. ఇది దాదాపు అన్ని దేశాల్లోనూ ఉంది. అయితే ఇకపై కేవలం సిగరెట్ ప్యాకెట్ మీద మాత్రమే కాకుండా ప్రతి సిగరెట్ మీద కూడా ఇలాంటి హెచ్చరికలను ప్రింట్ చేయనున్నారు. అయితే ఇది ఇక్కడ కాదు, కెనడాలో. కెనడాలో ప్రతి సిగరెట్ మీద సిగరెట్ త్రాగరాదు అనే హెచ్చరికని ప్రింట్ చేయాలని కెనడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రపంచంలో సిగరెట్లపై ప్రింటెడ్ వార్నింగ్స్ తీసుకొచ్చిన తొలి దేశంగా కెనడా మారనుంది.

ఎన్ని హెచ్చరికలు చేసినా సిగరెట్ తాగేవాళ్ళు మానట్లేదు. దీంతో ప్రతి సిగరెట్ మీద ఆ ప్రింటెడ్ వార్నింగ్ చూసిన తర్వాత స్మోకింగ్ అలవాటు కొంతమంది అయినా మానుకుంటారని ఆశిస్తున్నట్టు కెనడా ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ తెలిపారు. బాక్సులపై హెచ్చరికలను ముద్రించడం ద్వారా ఆ బాక్సులను వాడేసి పడేస్తున్నారు. అదే తాగే సిగరెట్లపై ప్రింటెడ్ వార్నింగ్ వేస్తే ప్రతి పఫ్ లో విషాన్ని పీలుస్తున్నామనే విషయం వారికి తెలుస్తూనే ఉంటుంది, అలా అయినా కొంతమంది అయినా మారుతారేమో అని కెనడా ప్రభుత్వం ఆశిస్తుంది. ఇలాంటిది మన దేశంలో కూడా వస్తే బాగుండు అని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి