iDreamPost

అరకోటికి పైగా జీతం..ఒక్క వీడియో వైరల్ కావడంతో అంతా గోవిందా!

  • Published Apr 25, 2024 | 12:02 PMUpdated Apr 25, 2024 | 12:02 PM

Indian Origin Fired After Video: కొంతమంది ఉన్నదానితో సంతృప్తి చెందక చిన్న చిన్న విషయాల్లో కక్కుర్తి పడుతుంటారు. కానీ కొన్నిసార్లు అది వారి కొంప ముంచుతుందన్న విషయం అనుభవంలోకి వస్తే కాని తెలియదు.

Indian Origin Fired After Video: కొంతమంది ఉన్నదానితో సంతృప్తి చెందక చిన్న చిన్న విషయాల్లో కక్కుర్తి పడుతుంటారు. కానీ కొన్నిసార్లు అది వారి కొంప ముంచుతుందన్న విషయం అనుభవంలోకి వస్తే కాని తెలియదు.

  • Published Apr 25, 2024 | 12:02 PMUpdated Apr 25, 2024 | 12:02 PM
అరకోటికి పైగా జీతం..ఒక్క వీడియో వైరల్ కావడంతో అంతా గోవిందా!

ఉన్నత విద్యనభ్యసించి స్వదేశంలో సరైనా ఉద్యోగం లభించని వారు.. విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతుంటారు. చాాలా మంది విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లి బాగా సంపాదించి అక్కడే స్థిరపడ్డవాళ్లు ఎంతో మంది ఉన్నారు. విదేశాల్లో పలువురు భారతీయులు ఉన్నతస్థానంలో ఉంటూ దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్నారు. కొంతమంది మాత్రం చేసే ఉద్యోగంలో నిర్లక్ష్యం, పలు నేరాలకు పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. కెనడాలో భారతీయ సంతతికి చెందిన ఓ ఉద్యోగి చేసిన తప్పిదం వల్ల 60ల లక్షపైగా ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ ఉద్యోగి చేసిన నేరం ఏంటీ? ఎందుకు 80లక్షల ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

సాధారణంగా భారత్ లో సామాన్యులే కాదు సంపన్నులు కూడా ఆహార ధాన్యాలు ఉచితంగా లేదా సరసమైన ధరలకు లభిస్తాయంటే ఎగబడతారు. ఇది ఇక్కడ సర్వసాధారణ విషయం. కానీ విదేశాల్లో మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తారు. కెనడాలోని టీడీ బ్యాంక్ లో పనిచేస్తున్న భాయతీయ సంతతికి చెందిన డేటా సైంటిస్ట్ అలాంటి ఉచిత ఆహారాన్ని పొందడం వల్ల అర కోటికి పైగా ఉన్న ఉద్యోగాన్ని చేతులారా పొగొట్టుకున్నాడు. కెనడాలో విద్యార్థులు, నిరుద్యోగులు, పేదలకు ఫుడ్ బ్యాంక్ ల నుంచి ఉచితంగా ఆహారం అందిస్తారు. టీడీ బ్యాంక్ లో డేటా సైంటిస్టు గా పని చేస్తు ఏడాదికి రూ.60 లక్షలకు పైగా  ప్యాకేజ్ తో ఉన్న మోహల్ ప్రజా‌ప్రతి విద్యార్థిగా నటిస్తూ ఫడ్ బ్యాంక్ నుంచి ఉచిత ధాన్యాలు తీసుకోవడమే కాకుండా అదేదో గొప్ప విషయం అన్నట్లు తన వ్లాగ్ లో వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ కావడంలో అసలుకు ఎసరు వచ్చింది. టీడీ బ్యాంక్ అధికారలు మోహల్ ని ఉద్యోగం నుంచి తొలగించారు.

ఇటీవల మోహల్ ఓ వీడియో తీసి తన వ్లాగ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో తాను ఫుడ్ బ్యాంక్ నుంచి ఉచిత ఆహార ధాన్యాలను ఎలా పొందాడో ట్రిక్స్ చెబుతూ కనిపించాడు. అలా చేయడం వల్ల వందలాది డాలర్లు ఎలా సేవ్ చేస్తున్న చూడండీ అంటూ గర్వంగా వ్యూవర్స్ కి చెబుతున్నాడు. అంతేకాదు ఫుడ్ బ్యాంక్ ను కూడా వీడియో తీసి చూపించాడు. తాను అక్కడ నుంచి పండ్ల, కూరగాయలు, పాస్తా నుంచి అనేక వస్తువులు ఈజీగా ఎలా పొందగలుగుతున్నాడో చూపించాడు. ఆ వీడియో కాస్త వైరల్ అయి అధికారుల దృష్టిలో పడటంతో జామ్ నుంచి తీసివేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఉన్నదాంట్లో సంతృప్తి పడకుండా కక్కుర్తి పడితే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి