iDreamPost

Jasprit Bumrah: కెనడా క్రికెట్ జట్టుకు ఆడాలనుకున్నాను.. కానీ! బుమ్రా షాకింగ్ కామెంట్స్

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెనడా క్రికెట్ టీమ్ తరఫున ఆడాలనుకున్నానని, కానీ అనుకోని కారణాల వల్ల కుదరలేదని చెప్పుకొచ్చాడు బుమ్రా. మరి కెనడా దేశం తరఫున ఎందుకు ఆడాలనుకున్నాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెనడా క్రికెట్ టీమ్ తరఫున ఆడాలనుకున్నానని, కానీ అనుకోని కారణాల వల్ల కుదరలేదని చెప్పుకొచ్చాడు బుమ్రా. మరి కెనడా దేశం తరఫున ఎందుకు ఆడాలనుకున్నాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

Jasprit Bumrah: కెనడా క్రికెట్ జట్టుకు ఆడాలనుకున్నాను.. కానీ! బుమ్రా షాకింగ్ కామెంట్స్

జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్టార్ పేసర్ పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తాజాగా జియో సినిమా షోలో తన సతీమణి సంజనా గణేషన్ తో పాటు కలిసి పాల్గొన్నాడు. ఈ షోలో బుమ్రా అభిమానులకు తెలియని షాకింగ్ నిజాలు వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేషన్ లో ఓ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో అభిమానులకు ఇప్పటి వరకు తెలియని విషయాలను వెల్లడించాడు. తన భార్య సంజనా ‘నువ్వు కెనడాకు వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నావ్ కదా? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా ఆన్సర్ ఇచ్చాడు.

Bumrahs shocking comments

బుమ్రా మాట్లాడుతూ..”మా రిలేటీవ్స్ కొందరు కెనడాలో ఉన్నారు. ఇక నా చదువు పూర్తైన తర్వాత కుటుంబం అంతా కలిసి అక్కడికి వెళ్లిపోదాం అనుకున్నాం. కానీ అక్కడి విభిన్నమైన సంస్కృతికి మేము అలవాటు పడలేమని మా అమ్మ భావించింది. దాంతో అక్కడికి వెళ్లలేకపోయాం. అయితే మేము అక్కడికి వెళ్తే.. ఆ దేశం తరఫున క్రికెట్ ఆడేవాడిని. అయితే ఇప్పుడు నేను టీమిండియాకు, ముంబై ఇండియన్స్ కు ఆడుతుండటం సంతోషంగా ఉంది” అంటూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇక బుమ్రా కెరీర్ విషయానికి వస్తే.. 2016లో టీమిండియాలోకి అడుగుపెట్టిన ఈ యార్కర్ల కింగ్ 36 టెస్టుల్లో 159, 89 వన్డేల్లో 149, 62 టీ20ల్లో 74 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్ లో 125 మ్యాచ్ లు ఆడి.. 155 వికెట్లు పడగొట్టాడు. మరి బుమ్రా చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి