iDreamPost

ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి మృతి.. ఏం జరిగిందంటే

  • Published Feb 17, 2024 | 9:14 AMUpdated Feb 17, 2024 | 9:14 AM

బంగారు భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు హఠాత్తుగా మృతి చెందాడు. దాంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వివరాలు..

బంగారు భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు హఠాత్తుగా మృతి చెందాడు. దాంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ వివరాలు..

  • Published Feb 17, 2024 | 9:14 AMUpdated Feb 17, 2024 | 9:14 AM
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి మృతి.. ఏం జరిగిందంటే

స్వదేశంలో కన్నా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తే.. భవిష్యత్తు బాగుంటుంది.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాము.. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతాము అనే భావనతో.. ఏటా మన దేశానికి చెందిన ఎందరో యువతీయువకులు.. విదేశాలకు వెళ్తున్నారు. అయితే అక్కడికి వెళ్లిన వారు అందరూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారా.. విదేశాల్లో మన యువతకు భద్రత ఉందా.. వారి ప్రాణాలకు రక్షణ ఉందా అంటే.. లేవని అనిపిస్తోంది ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తోన్న కొన్ని సంఘటనలు చూస్తే. ఇక తాజాగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు.. హఠాత్తుగా మృతి చెందాడు. ఆ వివరాలు..

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన కొందరు విద్యార్థులు ఈమధ్య కాలంలో దారుణ హత్యకు గురవుతున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. అదలా ఉంచితే.. నేడు మన సమాజంలో గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు ఓ పదేళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందగా.. తాజాగా మరో వ్యక్తి హార్ట్‌ ఎటాక్‌ కారణంగా ప్రాణాలు వదిలాడు. అయితే అది కూడా మన దేశంలో కాదు.. కెనడాలో ఆ వివరాలు..

కెనడాలో ఉన్నత చదువులు కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి ఒకరు గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. షేక్ ముజమ్మిల్ అహ్మద్ అనే విద్యార్థి.. 2022 డిసెంబర్ 22న కిచెనర్ సిటీలో వాటర్‌లూ క్యాంపస్‌లోని కొనెస్టోగా కాలేజీలో మాస్టర్స్ చదివేందుకు వెళ్లాడు. అయితే.. గత వారం రోజుల నుంచి అతడు జ్వరంతో బాధపడుతున్నాడట. ఈ క్రమంలోనే.. గురువారం ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందాడు.

అహ్మద్‌ స్నేహితులు.. అతడు చనిపోయన విషయాన్ని హైదరాబాద్‌లోని అహ్మద్‌ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఉన్నత చదవుల కోసం కెనడా వెళ్లిన అహ్మద్ మరణ వార్త విని.. అతడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. అయితే.. కెనడాకు వెళ్లక ముందు అహ్మద్ తన కుటుంబంతో కలిసి.. హైదరాబాద్‌లోని టోలీచౌకిలోని బాల్‌రెడ్డి నగర్ కాలనీలో ఉండేవాడు.

అహ్మద్ అంత్యక్రియల కోసం అతడి మృతదేహాన్ని ఇండియాకు చేర్చాలని అతడి కుటుంబ సభ్యులు.. విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి.. కెనడాలోని భారతీయ రాయబారి కార్యాలయంతో మాట్లాడి.. అహ్మద్ మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ఏర్పాటు చేశారు. అహ్మద్ మృతదేహం కోసం అతడి తల్లిదండ్రులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన కొడుకు.. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని భావిస్తే.. అందరాని లోకాలకు వెళ్లాడంటూ అహ్మద్‌ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి