iDreamPost

కెనడాలో అనుమానాస్పద రీతిలో భారత సంతతి ఫ్యామిలీ మృతి

కెనడాలో ఆ కుటుంబం 15 సంవత్సరాల నుండి జీవిస్తుంది. భార్యా భర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవు. వీరికో ముద్దుల తనయ. కానీ ఈ ముగ్గురు అనూహ్యంగా అనుమానాస్పద రీతిలో మృతదేహాలై కనిపించారు.

కెనడాలో ఆ కుటుంబం 15 సంవత్సరాల నుండి జీవిస్తుంది. భార్యా భర్తల మధ్య ఎటువంటి గొడవలు లేవు. వీరికో ముద్దుల తనయ. కానీ ఈ ముగ్గురు అనూహ్యంగా అనుమానాస్పద రీతిలో మృతదేహాలై కనిపించారు.

కెనడాలో అనుమానాస్పద రీతిలో భారత సంతతి ఫ్యామిలీ మృతి

భవిష్యత్తు కోసం, ఆర్థికంగా స్థిరపడేందుకు చాలా మంది విదేశాల బాట పడుతున్నారు. చదువు, ఉద్యోగాల వేటలో భాగంగా అక్కడకు వెళ్లి సెటిల్ అవుతున్నారు. అక్కడ ఇల్లు, ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ దేశ సిటిజన్ షిప్ వచ్చాక.. ఇండియాకు రాకపోకలు తగ్గిస్తున్నారు. కానీ ఇదే క్రమంలో కొంత మంది భారతీయలు అనూహ్యంగా మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కాలంలో దాడులు, హత్యలు, రోడ్డు ప్రమాదాల కారణంగా విదేశాల్లో భారతీయులు మృత్యువాత పడిన వార్తలు కలవరపాటుకు గురి చేసిన సంగతి విదితమే. తాజాగా కెనడాలో భారత సంతతికి చెందిన ఓ ఫ్యామిలీ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ ఇంట్లో ముగ్గురు బూడిద అయిపోయారు.

కెనడాలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత సంతతికి చెందిన దంపతులు, వారి ముద్దుల తనయ మృతి చెందారు. ఒంటారియా ప్రావిన్సుల్లో గత వారం ఈ ఘటన జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. మార్చి 7న బ్రాంప్టన్ వాన్ కిర్క్ డ్రైవ్ ప్రాంతంలో ఓ భవనం అగ్నికి ఆహుతి అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మంటలను ఆర్పివేయగా.. ముగ్గురు మృతదేహాలను కనుగొన్నారు. వీరు భారత సంతతికి చెందిన వారుగా గుర్తించారు. రాజీవ్ వారికూ (51), ఆయన భార్య శిల్పా కోట (47), వారి కుమార్తె మహెక్ వారికూ(16)గా గుర్తించారు. ఈ ఘటన ప్రమాదవ శాత్తూ జరగలేదని అనుమానిస్తున్న పోలీసులు.. ఈ ముగ్గురు మృతి అనుమానాస్పదంగా ఉందని చెబుతున్నారు. ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాన్ని వ్యక్తం  చేస్తున్నారు.

Family of Indian origin dies in Canada in suspicious manner

ఈ ప్రమాదం చూస్తుంటే.. ఇల్లు పూర్తిగా దగ్దమైంది. మంటలు ఆరిపోయాక.. చేపట్టిన తనిఖీల్లో ఈ ముగ్గురి అవశేషాలు లభించాయి పోలీసులకు. దీంతో ప్రమాదం జరిగిన తీరు.. ముగ్గురు చనిపోవడాన్ని చూశాక హత్య కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, రాజీవ్ కుటుంబానికి పొరుగు ఉంటున్న యూసఫ్ అనే వ్యక్తి వీరు మరణించడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఈ కుటుంబం 15 సంవత్సరాల నుండి ఇక్కడే నివాసం ఉంటుందని, ఒక్కసారి కూడా భార్య భర్తల మధ్య మనస్పర్థలు చూడలేదని చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన రోజు ఆ ఇంట్లో నుండి పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, నిమిషాల్లో మంటలు వ్యాపించాయని చెప్పాడు యూసఫ్. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మిస్టరీ కేసులో తమకు సహకరించాల్సిందిగా స్థానికుల్ని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి