iDreamPost

కుప్పకూలిన విమానం.. 10 మంది దుర్మరణం

  • Published Jan 24, 2024 | 10:37 AMUpdated Jan 24, 2024 | 10:37 AM

ఈ మద్య వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే టెక్నికల్ ఇబ్బందులు.. ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ మద్య వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే టెక్నికల్ ఇబ్బందులు.. ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

  • Published Jan 24, 2024 | 10:37 AMUpdated Jan 24, 2024 | 10:37 AM
కుప్పకూలిన విమానం.. 10 మంది దుర్మరణం

ఇటీవల వరుస విమాన ప్రమాదాలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపాల కారణంగా కొన్ని, మాన తప్పిదాలు, వాతావరణంలో హఠాత్తుగా ఏర్పడే మార్పులు., ల్యాండిగ్ చేసే సమయంలో.. కొన్నిసార్లు పక్షులు ఢీ కొని ప్రమాదాలు జరగుతున్నాయని విమాన శాఖ అధికారులు చెబుతున్నారు. చాలా వరకు సాంకేతిక లోపాలను గమనించి పైలట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసారు దురదృష్టవశాత్తు గాల్లోనే ప్రాణాలు వదిలిన విషాద ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరో విమాన ప్రమాదం జరిగింది.

మొన్న అఫ్ఘనిస్థాన్ లో విమాన ప్రమాదం.. తర్వాత మయన్మార్ కి చెందిన ఆర్మీ విమానం మిజోరాంలో కుప్పకూలిపోయిన ఘటన మరువక ముందే మరో విమాన ప్రమాదం జరిగింది. కెనడాలోని రిమోట్ నార్త్ వెస్ట్ టెరిటరీస్ సమీపంలో ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తుంది.. కాకపోతే అతని పరిస్థితి గురించి మీడియాకు వివరాలు వెల్లడించలేదు అధికారులు. ఫోర్ట్ స్మిత్ నుంచి టాకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఆ విమానానికి సంబంధించిన కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయ్యిందని.. ఆ తర్వాత ప్రమాదానికి గురి అయిందని ఒంటారియోలోని రెస్క్యూ సెంటర్ తెలిపింది.

నార్త్ వెస్ట్రన్ ఎయిర్ కంపెనీకి చెందిన ట్విన్ టర్బో విమానం రన్ వే నుంచి కిలో మీటర్ వెళ్లిన తర్వాత ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో ఫోర్ట్ స్మిత్ నుంచి బయలుదేరాల్సిన విమానాలు రద్దు చేశారు. ఈ విమానంలో ఉన్నవారంతా గోల్డ్ మైన్ కార్మికులుగా తెలుస్తుంది. ప్రమాద ఘటనపై కెనడా ట్రాన్స్ పోర్టు విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఆఫ్ఘనిస్థాన్ లో మొన్న మొరాకో రిజిస్టర్డ్ చిన్న విమానం ఈశాన్య పర్వత ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఐజ్వాల్ శివార్లలో మంగళవారం లెంగ్‌పుయి విమానాశ్రయంలో ఒక మయన్మార్ సైనిక విమానం కూలిపోయింది.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై డీసీజీఏ దర్యాప్తు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి