iDreamPost

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

ఏపీలోని ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో మంగళవారం ఉన్నట్టుండి పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ రైలును ఓ చోట నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఆ రైలు దిగి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇక అధికారులు స్పందించి మరమ్మత్తులు చేశారు. దీంతో అరగంట ఆలస్యంగా రైలు అక్కడి నుంచి బయలు దేరింది. ఇక ఆ రైలు తాడేపల్లిగూడెం వద్దకు చేరుకోగానే మరో రెండు బోగీల్లో పొగలు వచ్చాయి.

రెండుసార్లు పొగలు రావడంతో ప్రయాణికులు భయందోళలనకు గురై రైలు దిగి అక్కడి నుంచి పరుగులు తీశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరోమారు మరమ్మత్తులు చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుని మళ్లీ రైలు ఎక్కారు. ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు ప్రయాణికులు స్పందించి.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా రైల్వే అధికారులు ముందే జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి