iDreamPost
android-app
ios-app

స్టార్ బాయ్ సిద్ధూ టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఎలా ఉందంటే?

  • Published Feb 14, 2024 | 6:35 PM Updated Updated Feb 14, 2024 | 6:51 PM

Tillu Square Trailer Review: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ట్లైర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ ఈ విషయాలు గమనించారా?

Tillu Square Trailer Review: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ట్లైర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ ఈ విషయాలు గమనించారా?

  • Published Feb 14, 2024 | 6:35 PMUpdated Feb 14, 2024 | 6:51 PM
స్టార్ బాయ్ సిద్ధూ టిల్లు స్క్వేర్ ట్రైలర్ ఎలా ఉందంటే?

సిద్ధు జొన్నలగడ్డ అలియాస్ డీజే టిల్లు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. సిద్ధు అనే కంటే కూడా టిల్లు అంటేనే త్వరగా గుర్తుపడుతున్నారు. స్టార్ బాయ్ సిద్ధు కెరీర్ లో ఈ డీజే టిల్లు మూవీ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. 2022 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ గా మారిపోయింది. ఇప్పటికే సిద్ధు అని కాకుండా టిల్లూ అనే పిలుస్తున్నారు. ఈ మూవీ కూడా పార్ట్ 1 తరహానే మంచి విజయాన్ని సాధిస్తుందంటూ ఇప్పటికే సిద్ధూ జొన్నలగడ్డ కూడా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని లాంఛ్ చేశారు. మరి.. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.

ఈ సినిమా ఎంత పాపులర్ అయ్యిందో.. కుర్రాళ్లలో రాధికా పేరు కూడా అంతే పాపులర్ అయ్యింది. పార్ట్ 2కి కూడా ఆ క్రేజ్ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఏడాది క్రితమే టిల్లు స్క్వేర్ విడుదల అవుతుంది అనుకున్నారు. కానీ అది డిలే అయ్యి డిలే అయ్యి ఎట్టకేలకు మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతానికి అయితే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ట్రైలర్ ని లాంఛ్ చేశారు. ట్రైలర్ మొత్తం ఫుల్ లెంగ్త్ సిద్ధు వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇంక అనుపన కూడా సిద్ధూకి పోటీగా నటించింది. ఇలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్ లో అనుపను చూడటం ప్రేక్షకులకు మొదటిసారి అని చెప్పాలి. ఒకింత ఆశ్చర్యపడుతూనే.. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ చూశాక డీజే టిల్లు జస్ట్ శాంపిల్ అనే చెప్పాలి. ఈ టిల్లు స్క్వేర్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంది.

సినిమా ప్రమోషన్స్ సమయం నుంచి కూడా పార్ట్ 1 రిఫరెన్స్ లను ఆడియన్స్ మైండ్ లోకి ఎక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్ లో కూడా అదే ఫార్ములాని వాడారు. ట్రైలర్ స్టార్టింగ్ లోనే రాధికా పేరుతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అనుపమ పాత్ర కూడా రాధికాని పోలే ఉంటుంది అని చెప్పక చెప్పారు. ఎందుకంటే ఎలాగైతే టిల్లు రాధికా కష్టాన్ని తన నెత్తికి రుద్దుకున్నాడో.. ఇప్పుడు ఈ మూవీలో కూడా అదే జరగబోతోంది. అయితే ఈసారి యాక్షన్, ఎమోషన్, డ్రామా మాత్రమే కాకుండా.. రొమాన్స్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది. ట్రైలర్లో చూపించిన సీన్స్, చెప్పిన స్టోరీని బట్టి చూస్తే టిల్లు స్క్వేర్ లో అన్నీ ఎక్కువగానే ఉండబోతున్నాయి అని అర్థమవుతోంది. ఈ పార్ట్ లో టిల్లు గ్రేస్, యాక్టింగ్ మరో మెట్టుకు చేరినట్లు కనిపిస్తోంది. కొత్త క్యారెక్టర్స్ కూడా పరిచయం కాబోతున్నాయి. మొత్తానికి ట్రైలర్ తో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మీద మరింతగా అంచనాలు పెంచేశారు. మార్చి 29న థియేటర్లలో సందడి చేయబోతున్నారు. మరి.. టిల్లు స్క్వేర్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom