iDreamPost

వేశ్య పాత్రలో కాబోయే భార్య.. బో*ల్డ్ రివ్యూ ఇచ్చిన హీరో సిద్ధార్థ్!

Hero Siddharth Review Of Heeramandi: హీరో సిద్ధార్థ్- అదితీరావు హైదరీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అదితీరావు హైదరీ నటించిన వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీకి సిద్ధార్థ్ రివ్యూ ఇచ్చాడు.

Hero Siddharth Review Of Heeramandi: హీరో సిద్ధార్థ్- అదితీరావు హైదరీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అదితీరావు హైదరీ నటించిన వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీకి సిద్ధార్థ్ రివ్యూ ఇచ్చాడు.

వేశ్య పాత్రలో కాబోయే భార్య.. బో*ల్డ్ రివ్యూ ఇచ్చిన హీరో సిద్ధార్థ్!

హీరో సిద్ధార్థ్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ పక్కింటి కుర్రాడు మరోసారి బిజీగా మారిపోయాడు. అలాగే ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడు. స్టార్ హీరోయిన్ అదితీ రావ్ హైదరీతో ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అయితే అంతా సీక్రెట్ గా వీళ్లు పెళ్లి చేసుకున్నారు అనుకున్నారు. కానీ, అది నిశ్చితార్థమే అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పెళ్లి గురించి కూడా కామెంట్స్ చేశారు. త్వరలోనే పెద్దల నిర్ణయించిన ముహూర్తానికి వివాహ బంధంతో ఒకటవ్వనున్నారు. అయితే తాజాగా అదితీ రావు హైదరీ నటించిన ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనంగా మారింది. ఆ సిరీస్ కి సిద్ధార్థ్ తన రివ్యూను వెల్లడించాడు.

అదితీరావు హైదరీ సహా మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హాలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘హీరా మండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కి ఇప్పటికే చాలా మంది నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. రూ.200 కోట్ల బడ్జెట్ తో ఇండియన్ ఇండస్ట్రీలో వచ్చిన అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్ గా చెప్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ని ప్రమఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు. ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్ కూడా అతనే. ప్రస్తుతం ఓటీటీలో ఈ సిరీస్ బాగా వైరల్ గా మారింది. తాజాగా సిద్ధార్థ్ కూడా ఈ హీరామండి వెబ్ సిరీస్ కు తన రివ్యూని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

Siddarth

హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ లో అదితీ రావు హైదరీ బిబ్బోజాన్ అనే వేశ్య పాత్రలో నటించింది. ఈ సిరీస్ కి సంబంధించి సిద్ధార్థ్ మంచి రివ్యూ ఇచ్చాడు. “మనం కూడా సంజయ్ లీలా భన్సాలీ యుగంలో ఉన్నందుకు సంతోషించాలి. ఈ వెబ్ సిరీస్ లో సౌందర్యం, మ్యూజిక్, యాక్టింగ్, కథ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఆ కాలం పరిమితులకు లోబడి చెప్పిన ఒక మంచి డ్రామా. ఈ సిరీస్ లో హృదయాన్ని హత్తుకునేలా సంగీతం, మనల్ని మంత్రముగ్దులను చేసే విజువల్స్ తో తెరకెక్కించారు.

ఆ రోజుల్లో ఉండే ప్రేమ, స్వేచ్ఛకు సంబంధించి సంజయ్ లీలా చెప్పిన కథ హత్తుకుంటుంది. మొత్తం ఈ మూవీ టీమ్ కి శుభాకాంక్షలు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అంటూ సిద్ధార్థ్ తన రివ్యూను చాలా షార్ట్ గా షార్ప్ గా చెప్పేశాడు. మొత్తానికి ఈ సిసీర్ అతనికి బాగా నచ్చిందని సర్టిఫికేషన్ జారీ చేశాడు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఉంది చూడండి అని కూడా సిఫార్సు చేశాడు. ఇంక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ప్రేమ, స్వేచ్ఛ, అసాధారణ మహిళలు, వారికి ఉండే కోరికలు, వారి జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలు- ఇబ్బందులకు దృశ్య రూపమే ఈ వెబ్ సిరీస్ అంటూ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సంజయ్ లీలా భన్సాలీ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి