iDreamPost

రూ.45 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై దీపిక!

రూ.45 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై దీపిక!

ప్రజలకు సేవలు అందించడం ప్రభుత్వ అధికారుల బాధ్యత. పోలీసు , రెవెన్యు.. ఇలా ప్రభుత్వానికి సంబంధించిన ఏశాఖ ఉన్న కూడా ప్రజల కోసం పని చేస్తుంది. అయితే ఈ ప్రభుత్వ అధికారుల్లో కొందరు అవినీతి మార్గంలో పయనిస్తున్నారు. అవినీతి సంపాదన కోసం సామాన్య ప్రజలను పట్టిపీడిస్తున్నారు.  ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ అవినీతికి పాల్పడుతున్న వారిలో మహిళ అధికారులు కూడా ఉంటున్నారు. ఇటీవలే ఆర్ఐ సీఐ స్వర్ణలత అవినీతి వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళ ఎస్సై కూడా పట్టుబడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

విశాఖపట్నంలో ఆర్ఐ సీఐ స్వర్ణలత నోట్ల మార్పిడి వ్యవహారంలో రూ.15 లక్షలు తీసుకున్నారు. ఇద్దరు నావీ మాజీ అధికారులు  ఇచ్చిన ఫిర్యాదు స్వర్ణలతను ఉన్నతాధికారులు పట్టుకున్నారు. ఆమె..మాజీ నావీ అధికారుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మరికొందరితో పాటు ఆమెను అరెస్టు చేశారు. ఇటీవలే పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో పలు ఆసక్తిరమైన విషయాలు వెల్లడించారు. కమీషన్ కోసం కక్కుర్తిపడి ఈ పని చేశానని ఆమె పోలీసుల విచారణలో ఒప్పుకుంది.

ఇలా ఈమె వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించింది. ఇది మరవక ముందే మరో మహిళ పోలీస్ లంచం తీసుకుంటూ  ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ప్రకాశం జిల్లా కొనకమిట్ల పోలీస్ స్టేషన్లో  అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రూ.45 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై దీపిక పట్టుబడ్డారు.  ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లు తొలగిస్తాని, అందుకు తనకు లంచం  ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి.. ఆమెపై తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. మరి.. ఇలా లంచావతరం ఎత్తుతున్న మహిళ అధికారులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి .. ఆమె చేసిన పనికి అందరు షాక్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి