iDreamPost
android-app
ios-app

Shubman Gill: బాబర్‌ అజమ్‌ కాదు.. పాకిస్థాన్‌లోనూ భారత క్రికెటర్‌దే హవా!

  • Published Dec 13, 2023 | 3:20 PM Updated Updated Dec 13, 2023 | 3:20 PM

బాబర్ అజమ్ కు ఇంతకంటే దారుణమైన శిక్ష మరొకటి ఉండదనుకుంటా. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

బాబర్ అజమ్ కు ఇంతకంటే దారుణమైన శిక్ష మరొకటి ఉండదనుకుంటా. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Shubman Gill: బాబర్‌ అజమ్‌ కాదు.. పాకిస్థాన్‌లోనూ భారత క్రికెటర్‌దే హవా!

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను టీమిండియా ఆటగాళ్లు డామినేట్ చేస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు వరల్డ్ క్రికెట్ ను శాసిస్తున్నారు. ఇక ఇప్పటికే టీమిండియా మూడు ఫార్మాట్స్ లోనూ.. అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా గూగుల్ 2023లో అత్యధిక మంది సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల లిస్ట్ లో కియారా అద్వానీ తొలి స్థానంలో ఉండగా.. టీమిండియా యువ క్రికెటర్ గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఓవరాల్ గా గడిచిన 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో అత్యధిక మంది వెతికిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కాగా.. గిల్ కేవలం ఇండియాలోనే కాక దాయాది దేశం పాకిస్థాన్ లో కూడా హవా కొనసాగించాడు. సొంత ప్లేయర్ బాబర్ అజమ్ ను కాదని గిల్ ను తెగ వెతికారు పాకిస్థానీయులు.

బాబర్ అజమ్.. నేనే తోపు అంటూ గొప్పలు చెప్పుకుంటూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఎప్పుడూ విరాట్ కోహ్లీతో పోల్చుకుంటూ, అతడిని తక్కువ చేసి మాట్లాడుతూ.. విమర్శల పాలవడం మనం చాలా సార్లే చూశాం. ఇక ఈ విషయంలోనే కాక ఎన్నో సార్లు పాక్ అభిమానుల చేతనే తిట్టించుకున్నాడు బాబర్. ఈ విషయాన్ని గూగుల్ మరోసారి రుజువు చేసింది. తాజాగా గూగుల్ 2023లో దేశాల వారీగా ఎక్కువ మంది వెతికిన వ్యక్తుల లిస్ట్ ను విడుదల చేసింది. అందులో క్రికెటర్లు కూడా ఉన్నారు.

అందులో భాగంగా పాకిస్థాన్ లో టాప్-10 గూగుల్ సెర్చ్ లో బాబర్ అజమ్ చోటు దక్కించుకోలేకపోయాడు. అతడిని అక్కడి ప్రజలు బహుశా మర్చిపోయినట్లు ఉన్నారు. ఇక టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ భారత్ లోనే కాక పాక్ లో కూడా దుమ్మురేపాడు. పాక్ లో గూగుల్ సెర్చ్ టాప్-10 లిస్ట్ లో నిలిచాడు. ఈ జాబితాలో బాబర్ కు చోటు దక్కకపోడం గమనార్హం. దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులు మరోసారి బాబర్ పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఇంతకంటే దారుణం మరోటి ఉండదు బాబర్ బ్రో, నీలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి పాకిస్థాన్ లోనూ శుబ్ మన్ గిల్ సత్తా చాటడం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.