iDreamPost
android-app
ios-app

కన్నీళ్లు పెట్టిస్తోన్న కానిస్టేబుల్‌ రమేష్‌ చివరి వీడియో.. ‘నా భార్యే నా ప్రాణం’

  • Published Aug 05, 2023 | 5:48 PM Updated Updated Aug 05, 2023 | 5:48 PM
  • Published Aug 05, 2023 | 5:48 PMUpdated Aug 05, 2023 | 5:48 PM
కన్నీళ్లు పెట్టిస్తోన్న కానిస్టేబుల్‌ రమేష్‌ చివరి వీడియో.. ‘నా భార్యే నా ప్రాణం’

విశాఖలో కానిస్టేబుల్‌ రమేష్‌ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చి.. ఆపై ఏం తెలియనట్లు.. తన భర్త గుండెనొప్పితో మృతి చెందాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది రమేష్‌ భార్య శివాని. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ప్రేమించిన వాడి కోసం తన భర్తనే హత్య చేసింది శివాని. తన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ భర్త హత్యకు సుపారీ ఇచ్చింది శివాని. ఆ తర్వాత పక్కా పథకం ప్రకారం భర్తను హత్య చేయించింది. ముందుగా అతడి చేత పూటుగా మద్యం తాగించి.. ఆ తర్వాత అతడు మత్తులోకి వెళ్లాక.. రమేష్‌ ముఖం మీద దిండు పెట్టి ఊపిరడకుండా చేసి హత్య చేశారు నిందితులు.

ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. తన భర్తను హత్య చేసేటప్పుడు శివాని అక్కడే ఉండటమే కాక.. తానే తన భర్త రమేష్‌ కాళ్లు కదలకుండా పట్టుకుంది. తన వెంట ఏడడుగులు నడిచిన వ్యక్తిని తానే దగ్గరుండి అనంత లోకాలకు సాగనంపింది. రమేష్‌ హత్యకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రమేష్‌ చనిపోవడానికి ముందు తన భార్య గురించి మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరలవుతుంది. తన భార్య అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చాడు రమేష్‌.

రమేష్‌ మద్యం సేవిస్తుండగా ఈ వీడియో తీశారు. దీనిలో అతడు తన భార్య శివాని మీద తనకు ఎంత ప్రేమ ఉందో చెప్పుకొచ్చాడు. ‘‘మా ఆవిడ చాలా తెలివైంది. చదివింది తక్కువే.. కానీ గైడెన్స్‌ ఇస్తే చాలా సాధిస్తుంది. నేను ప్రతి ఒక్కరితో చెప్పేది.. నా లైఫ్‌ నా వైఫే. తను చాలా ధైర్యవంతురాలు.. నేను ఉన్నన్ని రోజులు తను ఆ ధైర్యం చూపుతుంది.. నేను లేకపోయినా చూపించాలి. నేను ఎప్పటి వరకు ఉంటానో.. నాకే తెలియదు. తను ధైర్యవంతురాలు కాబట్టే.. నేను ఎక్కువ రోజులు బతుకుతాను. చాలా మంది చదువుకున్న వాళ్ల కంటే నా భార్య చాలా బెస్ట్‌. దేవుడు కరుణిస్తే తనతో పాటే నూరేళ్లు కలిసి బతుకుతాను.. లేదంటే మధ్యలోనే పోతాను’’ అంటూ ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజనులు.. అలాంటి రాక్షసి గురించి ఎంత గొప్పగా చెప్పావు.. నీ లాంటి మంచి వ్యక్తిని కాదని.. క్షణకాల సుఖం కోసం పాకులాడిన నీ భార్య నిజంగా దురదృష్టవంతురాలు. లోకంలో భార్యలను నిత్యం హింసిస్తూ.. అనుమానించే భర్తలు ఎందరో ఉన్నారు. అలాంటిది నీకు ఇంత మంచి వ్యక్తి భర్తగా లభిస్తే.. ఇంతటి దారుణం ఎలా చేయగలిగావు అంటూ మండిపడుతున్నారు నెటిజనులు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş