iDreamPost
android-app
ios-app

Shilpa Shetty: ఆ స్టార్‌ హీరో నన్ను వాడుకుని మోసం చేశాడు.. శిల్పా శెట్టి సంచలన వ్యాఖ్యలు

  • Published Jun 08, 2024 | 5:32 PM Updated Updated Jun 08, 2024 | 5:32 PM

పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి బర్త్‌డే నేడు. ఈ క్రమంలో గతంలో ఆమె వెల్లడించిన కొన్ని ఆసక్తికర విషయాలు మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు మీకోసం

పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి బర్త్‌డే నేడు. ఈ క్రమంలో గతంలో ఆమె వెల్లడించిన కొన్ని ఆసక్తికర విషయాలు మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు మీకోసం

  • Published Jun 08, 2024 | 5:32 PMUpdated Jun 08, 2024 | 5:32 PM
Shilpa Shetty: ఆ స్టార్‌ హీరో నన్ను వాడుకుని మోసం చేశాడు.. శిల్పా శెట్టి సంచలన వ్యాఖ్యలు

శిల్పా శెట్టి.. ఈ పొడుగుకాళ్ల కన్నడ కస్తూరి తెలుగు వారికి కూడా పరిచయమే. వెంకటేశ్‌ సరసన సాహస వీరుడు.. సాగర కన్య చిత్రంలో నటించి.. తెలుగు ప్రేక్షకుల హృదయాలు కొల్ల గొట్టింది. ఆమె స్వస్థలం కర్ణాటక. కానీ బాలీవుడ్‌లో రాణించింది. తెలుగులో వీడెవడండీ బాసు, ఆజాద్‌, భలేవాడివి బాసు వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆవేవి ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన శిల్పా శెట్టి.. ఆ తర్వాత బాజీగర్‌ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, హిందీతో పాటు కన్నడ సినిమాల్లో కూడా యాక్ట్‌ చేసింది. కానీ సౌత్‌లో ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత.. సెలబ్రిటీ బిగ్‌ బ్రదర్‌ షోలో పాల్గొని.. విన్నర్‌గా నిలిచింది. నేడు అనగా జూన్‌ 8న శిల్పా శెట్టి బర్త్‌డే. ఈక్రమంలో గతంలో ఆమె ఓ స్టార్‌ హీరో గురించి సంచలన విషయాలు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..

శిల్పా శెట్టి కెరీర్‌ ప్రారంభంలో అనగా.. 1990ల్లో ఆమె స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. 1994లో విడుదలైన మై ఖిలాడి తూ అనారి అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆసమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే 2000 సంవత్సరలో వారిద్దరు విడిపోయారు. ఆమరుసటి ఏడాదే అనగా 2001లో అక్షయ్‌ కుమార్‌ నటి ట్వింకిల్‌ ఖన్నాను పెళ్లి చేసుకున్నాడు.

బిగ్‌ బ్రదర్‌ షోలో పాల్గొన్న సందర్భంగా.. శిల్పాశెట్టికి ఆమె వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని విషయాలను వెల్లడించింది. దానిలో భాగంగా అక్షయ్‌ కుమార్‌తో తన రిలేషన్‌ గురించి చెప్పుకొచ్చింది. అక్షయ్‌ కుమార్‌ తనను లవ్‌ చేస్తున్నాను అని చెబుతూనే.. ట్వింకిల్‌ ఖాన్నాతో కూడా రిలేషన్‌లో ఉన్నాడని.. ఆ తర్వాత తనను వదిలేశాడని చెప్పుకొచ్చింది. అంతేకాక తనతో ప్రేమలో ఉన్నప్పుడు అక్షయ్‌ తనను వాడుకున్నాడని.. ఆ తర్వాత మరో నటి కోసం తనను వదిలేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అక్షయ్‌ మీద తనకు చాలా కోపంగా ఉందని చెప్పుకొచ్చింది. అప్పట్లో ఈమె వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.

కాగా 2009లో శిల్పా శెట్టి ఐపీఎల్ ప్రాంచైజీ పార్ట్నర్‌గా ఉన్న రాజ్ కుంద్రాతో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. అదే ఏడాది నవంబర్ లో వీరికి వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. ఇక కొన్ని రోజుల క్రితం రాజ్‌ కుంద్రా మీద పోర్నోగ్రఫికి సంబంధించిన ఆరోపలు వచ్చిన సంగతి తెలిసిందే. అతడిని అరెస్ట్‌ కూడా చేశారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş