iDreamPost

Shaitaan: వెంకటేష్​తో తెలుగులో ‘సైతాన్’?

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్​కు రీమేక్స్ కొత్త కాదు. గతంలో పలు రీమేక్స్​లో యాక్ట్ చేసి బ్లాక్​బస్సర్ హిట్స్ అందుకున్నారాయన. ఇప్పుడు మరో రీమేక్​లో వెంకీ మామ పేరు వినిపిస్తోంది.

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్​కు రీమేక్స్ కొత్త కాదు. గతంలో పలు రీమేక్స్​లో యాక్ట్ చేసి బ్లాక్​బస్సర్ హిట్స్ అందుకున్నారాయన. ఇప్పుడు మరో రీమేక్​లో వెంకీ మామ పేరు వినిపిస్తోంది.

Shaitaan: వెంకటేష్​తో తెలుగులో ‘సైతాన్’?

బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ నటించిన ‘సైతాన్’ మార్చి 8వ తేదీన విడుదలైంది. సూపర్ హారర్ థ్రిల్లర్ గా ట్రైలర్ ద్వారా మంచి గుర్తింపునే తెచ్చుకొని, రిలీజైన తొలిరోజు 15 కోట్ల వసూళ్ళతో మోస్తరు ఓనెనింగ్స్ మాత్రమే తెచ్చుకోగలిగింది. కాకపోతే సమకాలీన సామాజిక పరిస్థితుల్లో ఆడపిల్లలు అనవసర పరిచయాల కారణంగా ఎలాంటి బీభత్సంలోకి కూరుకుపోతున్నారు, ఫలితంగా కుటుంబం ఎటువంటి అల్లకల్లోలానికి గురవుతుందనే కథాంశాన్ని ప్రధానంగా తెరకెక్కించారు. ఈ అంశంతో క్రిటికల్ రివ్యూలైతే బాగా వచ్చాయి సినిమాకి. దాదాపుగా విక్టరీ వెంకటేష్ చేసిన ‘దృశ్యం’ సినిమాకి ప్యారలల్​గా కనిపించింది. వెంకటేష్, మీనా కాంబినేషన్​లో చేసిన ఈ ఫిల్మ్ మంచి హిట్ అయింది. వెంకీకి మంచి పేరు తెచ్చింది.

ప్రస్తుతం ‘సైతాన్’ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకుంటే వెంకటేష్ ఈ మూవీని తెలుగులో చేయబోతున్నారనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. కొందరు చాలా బావుంటుంది వెంకటేష్ చేస్తే అని, రొటీన్ అవుతుంది వెంకటేష్ ఇటువంటి సినిమా గతంలో చేశారు కదా అనే చర్చలు జోరందుకున్నాయి. కానీ ‘దృశ్యం’ సినిమాకి ‘సైతాన్’ సినిమాకి తేడా ఏంటంటే, ‘సైతాన్’లో అజయ్ దేవగన్ కూతుర్ని ఓ ట్రిప్ లో పరిచయమైన ఒక కొత్త వ్యక్తి మత్తుమందు ఇచ్చి వశపరుచుకుంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏం చెబితే అదే ఆ అమ్మాయి చేస్తుంటుంది, అటువంటి దారుణమైన పరిస్థితుల నుంచి అజయ్ దేవగణ్ తన కూతుర్ని ఏ విధంగా రక్షించుకొని, సంరక్షించుకుంటాడనే నెరేషన్​లో కొంత హారర్ అండ్ థ్రిల్లర్ కంటెంట్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నది అనేది మాత్రం నిజం.

ఈ అంశాలు తెలుగుకైనా కొత్తగానే ఉంటాయి అనే పాయింట్ వాడివేడిగా సాగుతోంది. వెంకటేష్ చేస్తే ఫ్యామిలీ అడియన్స్ బాగా కనెక్ట్ అవుతారన్నది కూడా చర్చల్లోకి వస్తోంది. అయితే ఈ సినిమాని ఎవరు చేస్తారన్నదే ఇంక తేలలేదని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబే చేస్తారా? లేక ఎవరితోనైనా కంబైన్ అయి చేస్తారా? అన్నది కూడా మాట్లాడుకుంటున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా సురేష్ బాబు వేరే బ్యానర్ తో కలసి సంయుక్తంగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ముందుగా ‘సైతాన్’ రైట్స్ ఎవరు సొంతం చేసుకుంటారన్నదే ముఖ్యమైన పాయింట్. డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్ రంగాల్లో బాగా సీనియారిటీ ఉండి, ఇటీవలే సినిమా నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టిన ఒక ప్రముఖ సంస్థ ‘సైతాన్’ రైట్స్ సొంతం చేసుకోవడానికి అజయ్ దేవగణ్​ను కాంటాక్ట్ చేస్తున్నారని వినిపిస్తోంది. ఎందుకంటే ‘సైతాన్’ నిర్మాతల్లో అజయ్ దేవగణ్ కూడా ఓ భాగం కావడమే ఇందుకు కారణం.

ఇదీ చదవండి: లాల్ సలామ్: షాకింగ్ న్యూస్ బయటపెట్టిన ఐశ్వర్య రజినీకాంత్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి