iDreamPost
android-app
ios-app

లైఫ్ లో మొదటిసారి తిరుమలకు షారుఖ్! ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్!

  • Author ajaykrishna Published - 10:01 AM, Tue - 5 September 23
  • Author ajaykrishna Published - 10:01 AM, Tue - 5 September 23
లైఫ్ లో మొదటిసారి తిరుమలకు షారుఖ్! ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ తో కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పఠాన్ మూవీతో ఏకంగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు జవాన్ తో మరోసారి బాక్సాఫీస్ పై తన ఉనికిని నెక్స్ట్ లెవెల్ లో చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తవగా.. వరల్డ్ వైడ్ షారుఖ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా జవాన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ తో సినిమా.. సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక జవాన్ కి సంబంధించి ఫ్యాన్స్ లో బజ్ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి. అనిరుధ్ అందించిన పాటలు.. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేశాయి. పైగా షారుఖ్ కి జోడిగా ఈ సినిమాలో నయనతార ఫస్ట్ టైమ్ నటించగా.. దీపికా పదుకొనే కూడా కీలక పాత్రలో నటించింది. అయితే.. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించడం విశేషం. ఇప్పటికే జవాన్ నుండి విడుదలైన రెండు ట్రైలర్స్ మూవీలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని ఊరించేశాయి. డైరెక్టర్ అట్లీ సినిమా అంటే.. ఖచ్చితంగా హీరోలతో పాటు ఉమెన్స్ కి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ట్రైలర్ లో కూడా అది కనిపించింది.

ఇదిలా ఉండగా.. జవాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ దేవాలయాలను సందర్శిస్తోంది. సాధారణంగా ఏ సినిమాకు సంబంధించిన టీమ్ అయినా ప్రముఖ దేవాలయాలను సందర్శించి దైవ దర్శనం చేసుకుంటాయి. ఇప్పుడు జవాన్ టీమ్ కూడా అదే చేసింది. షారుఖ్ ఖాన్ జవాన్ టీమ్ తో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నాడు. షారుఖ్ తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా రావడం విశేషం. అంత స్పెషల్ ఏముంది అనంటే.. షారుఖ్ తిరుమలకు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అంట. ఈ విషయం తెలిసి సౌత్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దాదాపు దశబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న షారుఖ్ ఒక్కసారి కూడా తిరుమలను దర్శించుకోలేదా అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం షారుఖ్ జవాన్ టీమ్ తో కలిసి తిరుమలను సందర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి జవాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet